Tirumala: తిరుమల క్షేత్రంలో వైభవంగా వసంతోత్సవాలు
Tirumala: ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం
Tirumala: తిరుమల క్షేత్రంలో శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామి ఆలయానికి పడమర దిశలో ఉన్న వసంత మండపంలో ప్రతి ఏటా చైత్ర మాసంలో మూడు రోజుల పాటు వసంతోత్సవాలను టీటీడీ శాస్త్రోక్తంగా ఉంది. బంగారు తిరుచ్చిపై ఆలయం నుంచి ఊరేగింపుగా వసంత మండపం చేరుకున్న శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి ఉత్సవ మూర్తులకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధం లాంటి సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్బంగా ఉద్యనవన శాఖ వసంత మండపాన్ని పశు పక్షాదులతో నిండిన నందన వనాన్ని తలపించేలా అద్భుతమైన సెట్ వేశారు. పచ్చటి కొండలు, సెలయేరు, సింహాలు, పులి, ఏనుగులు, పాములు, కోతులు , పూలతోటలతో శోభాయమానంగా తీర్చి దిద్దిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.