Tirumala : తిరుమల సమాచారం, శ్రీవారి దర్శనం టిక్కెట్లు బుకింగ్..భక్తులను హెచ్చరించిన టీటీడీ

Tirumala : దర్శనం, సేవలు, వసతి బుకింగ్ లలో ఫేక్ ఐడీలతో దర్శనానికి వచ్చే యాత్రికులను కూడా టీటీడీ విజిలెన్స్ గుర్తిస్తోంది. అందువల్ల యాత్రికులు మధ్యవర్తుల దగ్గరకు వెళ్లకూడదని..ఆన్ లైన్ లేదా కరెంట్ బుకింగ్ ద్వారా దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలని భక్తులకు విజ్నప్తి చేస్తోంది.

Update: 2024-08-07 02:19 GMT

 TTD Tickets: భక్తులకు అలర్ట్..నేడు డిసెంబర్ నెల తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు రిలీజ్.. పూర్తి వివరాలివే

Tirumala : ఆన్ లైన్లో దర్వన టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు మధ్యవర్తులను సంప్రదించవద్దని టీటీడీ భక్తులకు మరోసారి విజ్నప్తి చేసింది. ఈమధ్య వెరిఫికేషన్ లో 545 మంది యూజర్ల ద్వారా 14,449 అనుమానిత శ్రీవాణి లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. అలాంటి వాటిని బ్లాక్ చేసి వారికి మెసేజ్ ఫార్వర్డ్ చేసింది. కొంతమంది వినియోగదారులు 225 శ్రీవాణి టికెట్లను బుక్ చేసుకున్నారు. ఈ అనుమానిత వ్యక్తులు దర్శనానికి వచ్చినప్పుడలా టీటీడీ విజిలెన్స్ చెక్ చేస్తోంది.

దర్శనం, సేవలు, వసతి బుకింగ్ లలో ఫేక్ ఐడీలతో దర్శనానికి వచ్చే యాత్రికులను కూడా టీటీడీ విజిలెన్స్ గుర్తిస్తుంది. అందుకే యాత్రికులు మధ్యవర్తుల దగ్గరకు వెళ్లకూడదని..ఆన్ లైన్ లేదంటే కరెంట్ బుకింగ్ ద్వారా దర్శనం టికెట్లను బుక్ చేసుకోవాలని విజ్నప్తి చేస్తోంది. అవకతవకలను పాల్పడే వారిపై టీటీడీ క్రిమినల్ చర్యలు తీసుకుంటుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని భక్తులకు సూచించింది.

ఇక శ్రీ ఆండాళ్ అమ్మవారి తిరువడిపురం శాత్తుమొరను పురస్కరించుకుని ఆగస్టు 7వ తేదీన తిరుమలలో పురుశైవారి తోట ఉత్సవం ఘనంగా జరగనుంది. పురాణాల ప్రకారం పాండ్య దేశంలో పరమ విష్ణుభక్తుడైన శ్రీ విష్ణు చిత్తుడికి చెందిన తులసీవనంలో ఆషాడ శుక్ల చతుర్థినాడు పూర్వఫల్లునీ నక్ష్యతలో భూదేవి అంశగా ఆండాళ్ అమ్మవారు ఆవిర్భవించారు. ఈ పవిత్ర రోజు సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు పురుశైవారితోటకు వేంచేపు చేస్తారు. అక్కడ నివేదనల అనంతరం స్వామి, అమ్మవార్లు బయలుదేరి పొగడ చెట్టు దగ్గరకు రాగానే హారతిఇస్తారు. హారతి పుష్పమాల, శ్రీశఠారి పొగడ చెట్టునకు సమర్పిస్తారు. శ్రీ శఠారికి అభిషేకం చేసి తిరిగి తిరుచ్చిపై ఉంచుతారు. అక్కడ నుంచి స్వామి, అమ్మవార్లు ఆలయ మాడ వీధుల గుండా ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు.


Tags:    

Similar News