Andhra Pradesh: లాక్‌డౌన్ పెట్టాల్సిందే
Andhra Pradesh: శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతుంది. కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండడంతో ఆస్పత్రుల్లో బెడ్‌లు దొరకని పరిస్థితి నెలకొంది.
Andhra Pradesh: శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతుంది. కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండడంతో ఆస్పత్రుల్లో బెడ్‌లు దొరకని పరిస్థితి నెలకొంది. రోజూ పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి నుంచి 15 వందల మధ్య వస్తున్న నేపథ్యంలో మినీ లాక్ డౌన్ సరిపోతుందా లేదా పూర్తిగా లాక్ డౌన్ చేయాలన్న అన్న అంశపై సిక్కోలువాసుల మనోగతంపై హెచ్.ఎం.టి.వి. గ్రౌండ్ రిపోర్టు
శ్రీకాకుళం జిల్లాలో గత నెల నుంచి కరోనా విజృంబిస్తుంది. మహమ్మారి కట్టడి కోసం మధ్యాహ్నం రెండు గంటల వరకే షాపులు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. గురువారం శ్రీకాకుళంలో 192 కేసులు, పలాసాలో 81 కేసులు. రాజాంలో 64. నరసన్నపేటలో 40 కేసులు బయటపడ్డాయి. మొత్తం బాధితుల సంఖ్య బాధితుల సంఖ్య 64,956కు చేరింది. జిల్లావ్యాప్తంగా 12 వేల మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.
ఒక్కసారిగా కేసులు పెరగడంతో శ్రీకాకుళంను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. వాణిజ్య కేంద్రమైన పలసాలో 31 వార్డులలో కంటైన్మెంట్ జోన్లే ఉన్నాయి. అలాగే పాతపట్నం, పాలకొండ ప్రాంతాల్లో కూడా కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. కంటైన్మెంట్ జోన్ లలో యువత బయట యథేచ్ఛగా తిరిగేస్తు న్నారు. దీంతో వైరస్ మరింత వ్యాప్తి చెందుతుంది అన్న విమర్శలు ఉన్నాయి.
శ్రీకాకుళం జిల్లాలో భారీగా కరోనా కేసులు పెరుగుతుండడంపై జనం అసహనం వ్యక్తం చేస్తున్నారు. విద్యాలయాలు, బ్యాంకులు తక్షణం మూసివేయాలని కోరుతున్నారు. వైరస్ వ్యాప్తి నివారణకు లాక్ డౌన్ విధించాలని డిమాండ్ చేస్తున్నారు. బిజినెస్ టైమ్ తగ్గించి, లాక్ డౌన్ పెంచాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. గతేడాది మాదిరిగా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించేవారిని శిక్షించాలని కోరుతున్నారు. ప్రాణం కన్నా లాక్ డౌన్ మిన్న కదా అని ప్రశ్నిస్తున్నారు. కనీపం 14 రోజులు లాక్ డౌన్ విధించాలని కోరుతున్నారు.
గతేడాది మాదిరిగానే పూర్తిగా లాక్ డౌన్ విధిస్తేనే పరిస్థితి అదుపులోకి వస్తుందని కొందరు తేల్చి చెబుతున్నారు. కరోనా ఉద్ధృతిని యుద్ధకాలం పరిస్థితులుగా భావించాలని సూచిస్తున్నారు. పది రోజులు ఇళ్ల నుంచి జనం బయటకు రాకుండా ఉంటే వైరస్ చైన్ కట్ అవుతుందని చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కరోనా కేసుల అదుపుకు లాక్ డౌన్ విధించాలని సిక్కోలు వాసులు అభిప్రాయపడుతున్నారు.