Somu Veerraju: 1978లో యూత్ లీడర్ గా రాజకీయ ఆరంగేట్రం చేసిన సోము వీర్రాజు

Update: 2020-07-28 12:09 GMT

Somu Veerraju: ఆంధ్రప్రదేశ్‌ లో పార్టీ బలోపేతం లక్ష్యంగా అడుగులు వేస్తోన్న బీజేపీ కీలక మార్పులు చేసింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణకు ఉద్వాసన పలికింది. సుదీర్ఘ కాలంగా పార్టీకి సేవలందిస్తోన్న ఫైర్ బ్రాండ్‌ సోము వీర్రాజును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది పార్టీ హై కమాండ్.

ఏపీకి సంబంధించి బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. కన్నా లక్ష్మీ నారాయణ ప్లేస్ లో సోము వీర్రాజును ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా నియామక ఉత్తర్వులు జారీ చేశారు.

సోము వీర్రాజు స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని కత్తెరు గ్రామం. 1957లో సూర్యారావు, గంగావతి దంపతులకు జన్మించారు. రాజమండ్రిలో ఇంటర్ వరకు చదివిన సోము వీర్రాజు భీమవరంలోని డీఎన్‌ఆర్‌ కాలేజ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన సోము వీర్రాజు 1982లో బీజేపీ తూర్పుగోదావరి జిల్లా సెక్రటరీగా ఎంపికయ్యారు. 1984 వరకు జిల్లా బీజేపీ సెక్రటరీగా కొనసాగిన ఆయన 1987లో జిల్లా జనరల్ సెక్రటరీగా పనిచేశారు. 1990లో బీజేవైఎం స్టేట్ సెక్రటరీగా 1993,94 లో బీజేవైఎం రాష్ట్ర విభాగానికి అధ్యక్షుడిగా ఎంపికయ్యారు.

ఇక 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు సోము వీర్రాజు. 2004,2005 మధ్య బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగారు. ఆ తర్వాత 2013 వరకు పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు సోము వీర్రాజు. 2013, 2015లో జాతీయ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా అధిష్టానం నియమించగా 2015లో ఏపీ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును నియమించటంతో ఆయనకు పార్టీ నేతల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాష్ట్ర బీజేపీ సోము వీర్రాజుకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసింది. ఇక రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సోము వీర్రాజు నాయకత్వంలో ఏపీలో బీజేపీ పెద్ద రాజకీయ శక్తిగా ఎదుగుతుందంటూ ట్వీట్ చేశారు. అటు బీజేపీ మాజీ అధ్యక్షుడు మాలకొండయ్య పార్టీని నడిపించే సత్తా ఉన్న నాయకుడు సోము వీర్రాజు అంటూ కామెంట్ చేశారు.

Tags:    

Similar News