Schools Reopen: శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభమైన పాఠశాలలు

Schools Reopen: భౌతిక దూరం, థర్మల్ స్రీనింగ్ చేస్తున్న ఉపాధ్యాయులు * జిల్లాలో 14,936 మంది ఉపాధ్యాయులు,

Update: 2021-08-17 01:23 GMT

శ్రీకాకుళంలో తెరుచుకున్న పాఠశాలలు (ఫైల్ ఇమేజ్)

Schools Reopen: సుదీర్ఘ కాలం తర్వాత ఏపీ వ్యాప్తంగా బడిగంట మోగింది. ఉదయం 9 గంటలకే తమ పిల్లలను పాఠశాలకు తీసుకుని వచ్చారు. దాంతో శ్రీకాకుళం జిల్లాలో అన్ని స్కూల్స్ లో పండుగ వాతావరణం సంతరించుకున్నాయి. ముఖ్యంగా పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా స్కూల్స్ కు వచ్చి ఉపాధ్యాయులతో డిస్కస్ చేయడం మొదటిరోజు కనిపించింది.

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న 38 మండలాలలో సుమారు 4 వేల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పున:ప్రారంభమై కొనసాగుతున్నాయి. కోవిడ్ నిబంధనలను ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా పాటిస్తున్నారు. విద్యార్ధికి విద్యార్ధికి మధ్య దూరం ఉండేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకున్నారు. అంతేకాదు.. ఎవరి వాటర్ బాటిల్ వారే తెచ్చుకునే విధంగా ముందుగానే ప్రిపేర్ చేశారు.

పాఠశాలకు వచ్చిన విద్యార్ధుల పట్ల ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది చాలా కేర్ తీసుకుంటున్నారు. వచ్చిన పిల్లలకి ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది శానిటైజేషన్, థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండే విధంగా విద్యార్థులకు సూచిస్తున్నట్టు తల్లిదండ్రులు తెలిపారు. మరికొంతమంది పేరెంట్స్ మాత్రం ఆన్‌లైన్‌ చదువులకే మొగ్గుచూపుతున్నారని డీఈవో కుమారి తెలిపారు.

శ్రీకాకుళం జిల్లాలో 14 వేల 936 మంది ఉపాధ్యాయులకు, 13 వేలకు పైగా బోధనేతర సిబ్బందికి వ్యాక్సినేషన్ ఇప్పటికే పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు  తమకు ఇష్టం ఉండే స్కూల్‌కి వచ్చినట్టు విద్యార్థులు తెలిపారు. స్కూల్‌లో ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తున్నామని ఉపాధ్యాయులు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా మొదటిరోజు మాత్రం విద్యార్థుల హాజరు తక్కువనే ఉందని అధికారులు తెలిపారు. ఈ సంఖ్య క్రమంగా పెరగనుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.  

Tags:    

Similar News