Sajjala Ramakrishna: మాటలు సోము వీర్రాజువి.. స్క్రిప్ట్ టీడీపీది
Sajjala Ramakrishna Reddy: టీడీపీ అనుబంధ సంస్థగా బీజేపీ పనిచేస్తుందని మండిపడ్డారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.
Sajjala Ramakrishna Reddy: టీడీపీ అనుబంధ సంస్థగా బీజేపీ పనిచేస్తుందని మండిపడ్డారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు, బీజేపీ ఎజెండా ఒక్కటే అని పేర్కొన్నారు. టీడీపీ స్క్రిప్ట్‌నే సోము వీర్రాజు చదివారని, బీజేపీని చూస్తుంటే జాలేస్తుందన్నారు. ప్రాంతీయ పార్టీకి అనుగుణంగా జాతీయ పార్టీ పనిచేస్తోందని, బీజేపీవి దిగజారుడు రాజకీయాలని సజ్జల ఫైర్ అయ్యారు.
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు లిక్కర్ ఆఫర్ పై దుమారం రేగుతోంది. అధికారమిస్తే యాభై రూపాయలకే లిక్కర్ అంటూ సోము చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు పేలుతున్నాయి. పేదలు అంటే అలుసా అంటూ ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కౌంటర్ ఇచ్చారు.