Retired Headmaster Kotaiah: కోటయ్య మృతి..ఆనందయ్య మందుపై సందేహాలు

Retired Headmaster Kotaiah: నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనంద‌య్య ముందు తీసుకున్న రిటైర్డ్ హెడ్ మాస్ట‌ర్ కోట‌య్యా మృతి చెందాడు

Update: 2021-05-31 05:45 GMT

Retired Headmaster Kotaiah (File Photo)

Retired Headmaster Kotaiah: నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనంద‌య్య ముందు తీసుకున్న రిటైర్డ్ హెడ్ మాస్ట‌ర్ కోట‌య్యా మృతి చెందాడు. గ‌త ప‌ది రోజులుగా అనారోగ్యం కార‌ణంగా ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నా కోట‌య్య ఈ రోజు ఉద‌యం క‌న్నూమూశాడు. కొన్ని రోజుల క్రితం క‌రోనా ముందు వేయించుకున్న విష‌యం తెలిసిందే. ఎన్ని ఆసుప‌త్రులు తిరిగినా మెరుగుప‌డ‌ని త‌న ఆరోగ్యం ఆనంద‌య్య మందు వేసుకోగానే నిమిషాల్లో మెరుగుప‌డింద‌ని ఇటీవ‌ల‌ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌కు సంబంధించిన వీడియో బాగా వైర‌ల్ అయింది.

అయితే, అనంత‌రం మ‌ళ్లీ అనారోగ్యం పాలైన కోటయ్య జీజీహెచ్‌లో చికిత్స పొందారు. చివరికి ఆరోగ్యం విష‌మించ‌డంతో ఆయన మృతి చెందారు. కంట్లో చుక్కలు వేసుకున్న వారం రోజుల అనంత‌రం కోటయ్య ఆరోగ్యం క్షీణించడంతో, ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనను చేర్చారు. అనంత‌రం పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం ఈ నెల 22న‌ నెల్లూరు జీజీహెచ్‌కి తరలించగా అప్ప‌టి నుంచి ఆయ‌న‌ అక్కడే చికిత్స పొందుతూ మరణించారు.అనేక ప్రాంతాల నుంచి ప్రజలు కృష్ణపట్నానికి బారులు తీరారు. తదనంతర పరిస్థితులతో ఆనందయ్య మందు పంపిణీకి బ్రేక్ పడింది. ఆనందయ్య మందు వాడిన కోట‌య్య ప‌ది రోజుల‌కే మ‌ర‌ణించ‌డంతో.. ఆనంద‌య్య ఆయూర్వేద మందుపై సందేహాలు నెల‌కొన్నాయి.

Tags:    

Similar News