Ramana Deekshitulu: నేను అప్పుడే చెప్పా.. బాధ్యులెవరైనా కఠిన చర్యలు తీసుకోవాలి

Ramana Deekshitulu: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం దారుణమని, బాధ్యులెవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తిరుమల మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు.

Update: 2024-09-20 05:32 GMT

Ramana Deekshitulu: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం దారుణమని, బాధ్యులెవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తిరుమల మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు. తిరుమల లడ్డూ ఘటనపై విచారణ జరిపించాలని కోరారు. తిరుమలలో సమస్యలపై ప్రశ్నిస్తే తనపై కేసులు పెట్టారన్న ఆయన.. గత ప్రభుత్వం తనను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టిందని గుర్తుచేశారు. అందుకే తాను ఆలయానికి దూరంగా ఉంటున్నానని అన్నారు.

తిరుమలలో ప్రసాదాల నాణ్యతపై గతంలో ఎన్నోసార్లు టీటీడీ ఛైర్మన్‌, ఈవో దృష్టికి తీసుకెళ్లానని.. కానీ లాభం లేకపోయిందన్నారు. పవిత్రమైన ఆవు నెయ్యిని కల్తీ చేసి శ్రీవారి ప్రసాదాల్లో వినియోగించడం అపచారమని ఆవేదన వ్యక్తంచేశారు. స్వామివారి నైవేద్యంలో కల్తీ జరగడం బాధాకరమని, కైంకర్యాల్లో కూడా లోపాలు జరిగాయని ఆరోపించారు రమణ దీక్షితులు.

Full View


Tags:    

Similar News