New Districts in AP: ఏపీలో కొత్త తలనొప్పి తెచ్చిపెడుతున్నకొత్త జిల్లాల ప్రతిపాదన

Update: 2020-08-15 12:32 GMT

New Districts in AP: ఏపీలో కొత్త జిల్లాల ప్రతిపాదన కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతోంది. మొన్న శ్రీకాకుళం నేడు గుంటూరు జిల్లా. కొత్త జిల్లాల ఏర్పాటుపైన కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. సహజంగా ప్రతిపక్షం ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెడతాయి. కానీ, ఇప్పుడు అధికార పార్టీ నేతనే ప్రభుత్వానికి సమస్యగా మారుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో స్థానికంగా ప్రజలు ప్రజా సంఘాల నుండి వస్తున్న డిమాండ్లతో అధికార పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

ఏపీలో 25 లోక్ సభా నియోజకవర్గాలను జిల్లాలుగా మార్చుతామంటూ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కొత్త జిల్లాల ఏర్పాటు అధ్యయానానికి కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మూడు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్న గుంటూరు జిల్లా మూడు జిల్లాలో విడిపోనూంది. నర్సారావుపేట జిల్లాగా మారుతుందని అక్కడి ప్రజలు ఆశతో ఉన్నారు. నర్సారావుపేటను జిల్లాగా మార్చాలంటూ ఎంపీ, ఎమ్మెల్యేతో పాటు లోక్ సభా నియోజకవర్గ పరిధిలోని మెజారిటీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ప్రజాసంఘాల నేతల ఆందోళనకు మద్దతు తెలుపుతూ ప్లకార్డు పట్టుకొని ఎమ్మెల్యే గోపిరెడ్డి నిరసన కార్యక్రమంలోనూ పాల్గొన్నారు.

ఇక్కడే మరో సమస్య మొదలైంది. పల్నాడు ప్రాంతానికి చారిత్రాత్మకత ఉందని పల్నాడు ప్రాంతాని బ్రహ్మనాయుడు, నాగమ్మ చరిత్ర ఉందని నర్సరావుపేట కు పల్నాడు చరిత్ర లేదంటు కొందరు కొత్త వాదన తెర మీదకు తెచ్చారు. నర్సరావుపేట ఇప్పటికే అభివృద్ధి చెందిందని గురజాల డివిజన్ వెనుకబడిన ప్రాంత అనే వాదనను బలంగా తెరపైకి తీసుకోస్తున్నారు పల్నాడు ప్రాంతం వాసులు. గురజాల డివిజన్ ను జిల్లా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పల్నాడు జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో నిరసనలు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ సైతం సంఘీబావం తెలుపుతోంది. గురజాల జిల్లా చేయాలని మాజీ ఎమ్మెల్యే యరపతినేని డిమాండ్ చేస్తున్నారు.

గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్వర్ రెడ్డికి కొత్త జిల్లాల అంశం ఇరకాటంలో పడేసింది. కాసు మహేశ్వరరెడ్డి పుట్టింది పెరిగింది కాసు కుటుంబానికి రాజకీయ ప్రాధాన్యత కల్పించింది నర్సరావుపేట. కాసు మహేశ్వరరెడ్డి రాజకీయ బిక్ష పెట్టింది మాత్రం పల్నాడు ప్రాంతం గురజాల నియోజకవర్గం. దీంతో కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అనే చందంగా మారింది కాసు పరిస్థితి. మరో వైపు వైసిపి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యావరప్రసాద్ పల్నాడును జిల్లా చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలే జగ్జీవన్ రావ్ జయంతి సందర్భంగా నర్సరావుపేట ఎంపి శ్రీకృష్ణదేవరాయలు నర్సరావుపేట జిల్లా చేయలని డిమాండ్ చేయగా అదే వేదిక పై నుంచి డొక్కా మాణిక్య వరప్రసాద్ పల్నాడును జిల్లా చేయాలంటూ వేర్వేరు వాదనలు వినిపించారు.

నర్సరావు పేటను కొత్త జిల్లా ఏర్పాటు చేయాలా పల్నాడు కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలా అన్నది ప్రభుత్వానికి అధికార పార్టీ నేతలకు చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. నర్సరావుపేట జిల్లా చేస్తే పల్నాడు ప్రాంతం వాసులు వైసిపి పై తీవ్ర అసంతృప్తి తో రగిలిపోతారు. పల్నాడు ప్రాంత చేస్తే నర్సరావుపేట వాసులు అసంతృప్తిని వెళ్లగకుతారు ప్రభుత్వం ఈరెండు ప్రాంతాల వ్యవహారంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.

Tags:    

Similar News