Property Tax Hike: ఏపీ మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను పోటు

Property Tax Hike: కరోనా కాటు.. ధరల దరువుతో అల్లాడుతున్న జనంపై తాజాగా ఏపీలో పన్నుల పోటు పడింది.

Update: 2021-06-17 06:00 GMT

Property Tax Hike: ఏపీ మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను పోటు

Property Tax Hike: కరోనా కాటు.. ధరల దరువుతో అల్లాడుతున్న జనంపై తాజాగా ఏపీలో పన్నుల పోటు పడింది. జోన్ల విధానానికి స్వస్తి చెప్పి కొత్తగా ఆస్తి విలువ ఆధారంగా భవనాలపై పన్నులు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విధనంలో ఇప్పుడు చెల్లిస్తున్న ఆస్తి పన్నుకు ఎంత లేదన్నా 15 నుంచి 20 శాతం వరకు భారం పడుతున్నట్లు సమాచారం.

ఏపీ మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను పోటు పడింది. గతంలో గుంటూరుతో పాటు ఆయా మున్సిపాలిటీలలో ఆయా ప్రాంతాలను బట్టి ఏ, బీ, సీ జోన్లుగా విభజించేవారు. దీంతో మురికివాడల్లో కొంత తక్కువగా సంపన్న ప్రాంతాల్లో కొంచెం ఎక్కువగా వాణిజ్య భవనాలకు మరికొంత అధికంగా పన్నులు ఉండేవి. ఈ పన్నుల ప్రకారం ఆయా ప్రాంతాల్లో అద్దెలు కూడా ఉండేవి. ఇప్పుడీ కొత్త విధానంతో అన్ని ప్రాంతాల్లోని గృహాలకు 0.15 శాతం, అవాణిజ్య భవనాలకు 1.30 శాతం ఆస్తి విలువ ఆధారంగా పన్నులు వేసేలా నిర్ణయం తీసుకున్నారు. కొత్త పన్నుల ప్రకారం ప్రస్తుతం నగరవాసులు చెల్లిస్తున్న ఆస్తి పన్ను మరో 15-20 శాతం పెరిగింది.

గుంటూరు జిల్లాలోని ఆయా మున్సిపాలిటీలలో ఇక నుంచి అన్ని రకాల భవనాలకు ఆస్తి పన్ను విధింపులో ఒకే శ్లాబ్‌ విధానాన్ని అవలంబిస్తున్నారు. దానికి తోడు చెత్త పన్ను విధానాన్ని కూడా ప్రవేశపెట్టడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వినిపిస్తోంది. కరానాతో పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇంటి పన్ను పెంచడంతో పాటు చెత్త పన్ను కూడా వసూల్ చేయటంతో దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వం పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు.

Full View


Tags:    

Similar News