Posani Krishna Murali: నేను చచ్చిపోతే లోకేష్‌దే బాధ్యత..
Posani Krishna Murali: నారా లోకేష్‌పై పోసాని కృష్ణమురళి సంచలన ఆరోపణలు చేశారు.
Posani Krishna Murali: నారా లోకేష్‌పై పోసాని కృష్ణమురళి సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపేందుకు లోకేష్ కుట్ర చేస్తున్నారన్నారు. కోర్టుకు హాజరయ్యే సమయంలో తనను చంపేందుకు లోకేష్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తాను చచ్చిపోతే లోకేష్‌దే బాధ్యతని అన్నారు. లోకేష్ కంటే క్రెడిబులిటీ ఉన్నవాడినని చెప్పారు. తాను కేసు పెడుతా...? నిజం కావాలా..? సాక్ష్యం కావాలా.? అని ప్రశ్నించారు. లోకేష్ పీఏ చైతన్య తనకు ఫోన్ చేసి టీడీపీలోకి ఆహ్వానించాడని తెలిపారు.
లోకేష్ ఎవరిపైనా విమర్శలు చేయలేదా..? అని పోసాని కృష్ణ మురళి ప్రశ్నించారు. లోకేష్ తనపై 4కోట్లకు పరువు నష్టం దావా వేశారన్నారు. జగన్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన లోకేష్‌పై పరువు నష్టం దావా వేస్తే 20ఏళ్లు జైళ్లో ఉంటారని చెప్పారు. తనపై పాత కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చంద్రబాబు అక్రమాలు బయట పెట్టడంతో తనపై కక్ష కట్టారన్నారు. ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయగల సమర్ధుడు చంద్రబాబని తెలిపారు.