Anandayya Medicine: ఆనందయ్య మందు పంపిణీ వ్యవహారంలో రాజకీయ జోక్యం

Anandayya Medicine: ఆనందయ్య మందు పంపిణీ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటుంది.

Update: 2021-06-17 05:29 GMT

Anandayya Medicine: ఆనందయ్య మందు పంపిణీ వ్యవహారంలో రాజకీయ జోక్యం

Anandayya Medicine: ఆనందయ్య మందు పంపిణీ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటుంది. ఓవైపు ప్రభుత్వం, న్యాయస్థానం అనుమతి ఇచ్చినా మందు పంపిణీకి అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. చిత్తూరు జిల్లా పుదిపట్లలో ఇంటింటికీ మందు పంపిణీ చేస్తున్న స్థానిక సర్పంచ్‌ను అడ్డుకున్న పోలీసులు మందు పంపిణీకి ససేమిరా అంటున్నారు. తమను కాదని పంపిణీ చేస్తే కేసులు తప్పవని హెచ్చరిస్తున్నారు. వైసీపీ సర్కార్ మందు పంపిణీకి ఓకే చెప్పినా పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారు.?

చిత్తూరు జిల్లాలో ఆనందయ్య మందు పంపిణీ వ్యవహారంలో రాజకీయ జోక్యం స్తృతిమించుతోంది. కృష్ణపట్నం మందు తెచ్చి పంపిణీ చేయాలని చూసినవారికి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. చంద్రగిరి నియోజకవర్గం పుదిపట్ల పంచాయతీలో మందు పంపిణీ చేస్తున్న గ్రామ సర్పంచ్‌కు చేదు అనుభవం ఎదురైంది. అటు పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో జనసేన నేత గణేష్ యాదవ్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఈ రెండు ప్రాంతాలేకాదు మరిన్ని చోట్ల ఆనందయ్య మందు పంపిణీని అడ్డుకుంటున్నారని వాపోతున్నారు.

వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మందు తయారీ చేపట్టినప్పటికీ కేవలం ఒక్క నియోజకవర్గానికే పరిమితం చేశారు. నియోజకవర్గంలో ఇంటింటికీ అధికారికంగా మందు పంపిణీ కూడా జరుగుతోంది. ప్రజల నుంచి ఆదరణ కూడా బాగానే ఉండడంతో జిల్లాలోని ఇతర పార్టీల నేతలు నానా తిప్పలు పడి ఆనందయ్య దగ్గర నుంచి మందు తెచ్చి పంపిణీ చేద్దామనుకున్నా అధికారులు, పోలీసులు అడ్డుతగులుతున్నారు. దీంతో ఇతర పార్టీలకు చెందిన లోకల్ లీడర్స్ మండిపడుతున్నారు. మంచి చేయడానికి అధికార పార్టీనే అయ్యుండాలా అని ప్రశ్నిస్తున్నారు.

ఆనందయ్య మందు అధికార పార్టీ నేతల పేటెంట్‌గా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల కోసం పనిచేయాల్సిన బాధ్యత తమపైనా ఉందని పంపిణీని అడ్డుకోవడంలో ఉన్న అంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News