Polavaram Project: పోలవరంలో వేగంగా సాగుతున్న హైడ్రాలిక్ గేట్ల అమరిక!
Polavaram Project: పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి
Polavaram Project: ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పోలవరం ప్రాజెక్టు తుది రూపానికి సిద్ధమవుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రాలిక్ హాయిస్టి సిలిండర్లతోపని చేసే గేట్ల బిగింపు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. 2022 ఖరీఫ్ సీజన్ లో కాలువలకు నీటిని విడుదల చేసి పోలవరం ఫలాలను రైతులకు అందించేలా ప్రణాళికలు రూపొందించింది ప్రభుత్వం. గోదావరికి 50 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసే విధంగా స్పిల్ వేకు 48 గేట్లను బిగించనున్నారు.
పోలవవరం(Polavaram Project)లో మరో సాంకేతిక అధ్బుతం ఆవిష్కృతం అయ్యింది. ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రాలిక్ హాయిస్టి సిలిండర్లతో పని చేసే బిగింపు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. సీఎం జగన్ ప్రకటించిన విధంగా 2022 నాటికి పోలవరం నుంచి సాగు నీరు అందించేందుకు పనులు చురుగ్గా సాగుతున్నాయి. భారీ క్రేన్లు, అత్యాధునిక సాంకేతి పరిజ్ఞానంతో స్పిల్ వే గేట్ల బిగింపు ప్రక్రియ కొనసాగుతోంది. మేఘా ఇంజినీరింగ్ సంస్ధ 2019 నవంబర్ 21న పోలవరం పనులు ప్రారంభించింది. అప్పట్లో వచ్చిన వరదలో పాడైన అంతర్గత రహదారుల నిర్మాణం పూర్తి చేసి స్పీల్ వేలో రెండు లక్షల 29 వేల 61 క్యూబిక్ మీటర్ల కాంక్రిట్ పని చేపట్టారు. ప్రాజెక్టు స్పిల్ వే పై ఏర్పాటు చేయాల్సిన 192 గడ్డర్లను అనతి కాలంలోనే నిర్మించారు.
ప్రాజెక్టు(Polavaram Project)కు ఏర్పాటు చేసిన 9 గేట్లకు సంబంధించి ఆర్మ్ గడ్డర్లు, హారిజాంటలో గడ్డర్లు స్కిన్ ప్లేట్లు అమర్చారు. వెల్డింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఓ వైపు కరోనా.మరో వైపు వరదలు వచ్చినా పనులకు ఆంటంకం కలగకుండా ఇంజినీరింగ్ పద్దతుల్లో పనులు చేపడుతున్నారు. స్పీల్ వే ఛానెల్ కు సంబంధించి ఇప్పటి వరకు ఒక లక్షా పది వేల 33 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేశారు. అదే విధంగా 10 లక్షల 64 వేల 417 క్యూబిక్ మీటర్ల మట్టితవ్వకం పూర్తి చేశారు. 2020 జులైలో వచ్చిన వరదల కారణంగా కాంక్రీట్, మట్టి తవ్వకం పనులు నిలిచిపోయాయి. 70 మోటారు పంపులతో వరద నీటిని త్వరితగతిన తోడేందుకు వినియోగిస్తున్నారు. వరద నీరు తొలగించిన ప్రదేశంలో రోడ్ల ఏర్పాటు పూర్తి చేశారు.
దాదాపు 2.66 లక్షల క్యూబిక్ మీటర్లు కు పైగా కొండ తవ్వకం పనులు పూర్తి అయ్యాయి. గ్యాప్-1 లో వైబ్రో స్టోన్ కాలమ్స్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే 1789 ప్రోబ్స్ పూర్తయ్యాయి. గ్యాప్-2లో వెబ్రో క్యాంపక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక గ్యాప్ 3లోనూ క140 మీటర్ల కాంక్రీట్ డ్యాం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే 1211 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేపట్టారు. ఎగువ కాపర్ డ్యాం ఎత్తు పెంచేందుకు బండ రాయి తొలగించే పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 18 వేల 480 క్యూబిక్ మీటర్ల రాక్ ఫిల్ పనులు జరిగాయి.
పోలవరం(Polavaram Project) పూర్తితో రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం సాకారమైనట్లే అవుతుందని రాష్ర్ట ప్రభుత్వం భావిస్తోంది. 960 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రాన్ని పూర్తి చేయడం ద్వారా రాష్ట్ర ప్రజలకు వెలుగులు పంచేందుకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది.