Krishna: పవిత్ర ఘాట్‌లో పరమ గలీజ్‌గాళ్లు
Krishna: పవిత్ర ఘాట్‌లో పరమ గలీజ్‌గాళ్లు మోపయ్యారు.
Krishna: పవిత్ర ఘాట్‌లో పరమ గలీజ్‌గాళ్లు మోపయ్యారు. కృష్ణానది ఇసుక తిన్నెలను అడ్డాలుగా మార్చుకొని ఆకృత్యాలకు తెగబడుతున్నారు. పీకలదాక తాగడం. గంజాయి మత్తులో జోగడం ఆ గలీజుగాళ్లకు వ్యసనం అయిపోయింది. వాళ్ల చావు వాళ్లు చావని కానీ అభం శుభం తెలియని అమాయకులపై పడుతున్నారు. మొన్న సరదాగా కాబోయే భర్తతో కబర్లు చెప్పుకుంటూ సీతనగరం ఘాట్‌వైపు వచ్చిన ఓ అమ్మాయిపై అత్యాచారానికి ఒడిగట్టారు. కాబోయే భర్తను కట్టేసి, పైశాచిక ఆనందం పొందారు. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేస్తోంది.
కృష్ణా నదిలో నీళ్లు లేకపోవడంతో ఆ ఇసుక తిన్నెలను గంజాయి బ్యాచ్‌లు, బ్లేడ్ బ్యాచ్‌లు అడ్డాగా మార్చుకున్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మార్చేశారు. ఇవేమీ తెలియని విజయవాడకు చెందిన ఓ జంట సరదాగా అటువైపు వెళ్లడమే వారి పాలిటశాపమైంది. అరిచిన ఎవరికీ వినిపించనంత దూరం. చుట్టూ చిమ్మని చీకటి ఏం చేయలేని నిస్సాయస్థితి. చివరకు ఆ దుండగల చేతిలో ఆ అమ్మాయి బలికావాల్సి వచ్చింది. దుండగులు సెల్‌ఫోన్లు, డబ్బు బాధితురాలి చెవిదుద్దులను కూడా వదిలిపెట్టలేదు. వాటిని లాక్కొని నాటు పడవలో పారిపోయారు.
తాడేపల్లి గ్యాంగ్‌రేప్ ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. నిందితుల కోసం కృష్ణా, గుంటూరు జిల్లాల పోలీసులు వేటను ముమ్మరం చేశారు. మూడు ప్రత్యేక బృందాలతో మృగాళ్ల కోసం గాలింపు చేపట్టారు. ఘటనాస్థలం నుంచి ఆధారాలు సేకరించారు. ఓ నిందితుడిని బాధిత యువకుడు గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే పోలీసుల నిఘా లేకపోవడంతో రైల్వే బ్రిడ్జి వద్ద గంజాయి, బ్లేడ్ బ్యాచ్ తిష్ట వేశారని స్థానికులు వాపోతున్నారు. రాత్రి సమయాల్లో ఈ ముఠాలు నేరాలకు పాల్పడుతున్నట్లు చెబుతున్నారు.