Andhra Pradesh: నూతన ఇసుక విధానంలో రిజిస్ట్రేషన్ అవసరం లేదు: ద్వివేది

Andhra Pradesh: నూతన ఇసుక విధానంలో రిజిస్ట్రేషన్ అవసరం లేదని పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి జి.కె.ద్వివేది స్పష్టం చేశారు.

Update: 2021-03-22 13:53 GMT

Andhra Pradesh: నూతన ఇసుక విధానంలో రిజిస్ట్రేషన్ అవసరం లేదు: ద్వివేది

Andhra Pradesh: నూతన ఇసుక విధానంలో రిజిస్ట్రేషన్ అవసరం లేదని పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి జి.కె.ద్వివేది స్పష్టం చేశారు. ప్రజలు ఏ రీచ్ నుంచైనా ఇసుక తీసుకెళ్లవచ్చని తెలిపారు. ప్రజలు సొంత వాహనంలోనూ ఇసుక తీసుకెళ్లవచ్చని.. నాణ్యత పరిశీలించి నచ్చిన చోట ఇసుక పొందవచ్చని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇసుక రీచ్‌ల్లోనూ ఒకే ధర ఉంటుందని ద్వివేది వెల్లడించారు.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ లేకుండా నేరుగా ఇసుక కొనుగోళ్లు ఉంటాయని చెప్పారు. కొత్త విధానంలో ప్రజలకు లబ్ధి జరుగుతుందని అన్నారు. నిర్ణయించిన ధరకే ఇసుక అమ్మకాలు జరుగుతున్నాయని, ప్రతీ నియోజకవర్గానికి ఒక ఇసుక రీచ్‌ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అన్ని రీచ్‌ల్లోనూ ఒకే ధర అమలు చేస్తున్నామని, ప్రతి ఇసుక రీచ్‌ వద్ద 20 వాహనాలు ఏర్పాటు చేసిట్లు చెప్పారు.

Tags:    

Similar News