Steel Plant Privatization: ఏపీలో కొనసాగుతున్న బంద్

Steel Plant Privatization: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆర్టీసీ బస్సులు ఎక్కడిక్కడ నిలిచి పోయాయి.

Update: 2021-03-05 02:57 GMT

ఫైల్ ఇమేజ్


Steel Plant Privatization: రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా బంద్ కొనసాగుతోంది.విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు పిడికిలి బిగించిన కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ఏపీ బంద్ కు'విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి' ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు ఎక్కడిక్కడ నిలిచి పోయాయి. అంతే కాకుండా ప్రజా, కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, లారీ యజమానుల సంఘాలతోపాటు ప్రభుత్వం కూడా బంద్‌కు మద్దతు ప్రకటించాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ మోహరించారు. మరో వైపు బిజెపి మినహా వైసీపీతో సహా అన్ని పార్టలు బంద్ కు మద్దతు ప్రకటించాయి.

మరోవైపు ఇవాళ చంద్రబాబు విశాఖ వెళ్లనున్నారు. రాష్ట్ర బంద్‌కు టీడీపీ మద్దతు పలికింది. తెలుగు ప్రజల ఆత్మగౌరవమైన విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News