Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం చిన్నకుమారుడికి గాయాలు.. సింగపూర్ వెళ్లనున్న పవన్ కల్యాణ్

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ సింగపూర్ వెళ్లనున్నారు. అక్కడి స్కూల్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆయన చిన్నకుమారుడు మార్క్ శంకర్ కు గాయాలు అయ్యాయి. మంటలు చెలరేగడంతో అతడి చేతులు, కాళ్లకు గాయాలయ్ాయయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో అస్వస్థతకు గురయ్యాడు. స్కూల్ సిబ్బంది అతన్ని స్థానికి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పవన్ కల్యాణ్ ప్రస్తుతం అల్లూరి సీతారామారాజు జిల్లా పర్యనటలో ఉన్నారు. కార్యక్రమాలు రద్దు చేసుకుని సింగపూర్ వెళ్లాలని పార్టీ నేతలు ఆయనకు సూచించారు. ఇచ్చినమాట ప్రకారం గిరిజనులను కలిసి వెళ్తానంటూ పవన్ తెలిపారు. నేడు ప్రారంభించాల్సిన అభివ్రుద్ధి కార్యక్రమాలకు ఏర్పాటు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటన ముగిసిన తర్వాత పవన్ కల్యాణ్ సింగపూర్ వెళ్లనున్నారు.