
Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో టీటీడీ మరింత అలర్ట్ అయ్యింది. అలిపిరి నుంచి ఆలయం వరకు భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. అలిపిరి తనిఖీ కేంద్రంతోపాటు ఘాట్ రోడ్డులోనూ చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. పలు చోట్ల ఆర్టీసీ బస్సులతోపాటు ఇతర ప్రైవేట్ వెహికల్స్ చెక్ చేస్తోంది. ప్రయాణికుల లగేజీతోపాటు ప్రతి బ్యాగ్ ను క్షుణ్ణంగా చెక్ చేస్తున్నారు సెక్యూరిటీ సిబ్బంది. పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో ఎంతో మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు విదేశీయులు సహా మొత్తం 28 మంది మరణించారు. ఎంతో మంది జీవితాల్లో విషాదం నెలకొంది.
ఈ ఉగ్రదాడితో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ నేపథ్యంలోనే భారత్ లోని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల వద్ద భద్రతను మరింత పెంచాయి. దీనిలో భాగంగా టీటీడీ అలర్ట్ అయ్యింది. ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలను ద్రుష్టిలో పెట్టుకుని టీటీడీ యంత్రాంగం మరింత భద్రతను పెంచింది. అలిపిరి నుంచి ఆలయం వరకు భద్రతను కట్టుదిట్టం చేసింది. అలిపిరి తనిఖీ కేంద్రంతోపాటు ఘాట్ రోడ్డులోనూ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తోంది. ప్రయాణికుల లగేజీతోపాటు ప్రతి బ్యాగ్ ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ సందర్భంగా టీటీడీ సీవీఎస్ఓ హర్షవర్ధన్ రాజు మాట్లాడారు. తిరుమలలోని అన్ని ప్రాంతాల్లో అధునాతన టెక్నాలజీతో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టామని తెలిపారు.