పొత్తులపై చంద్రబాబు, పవన్ ఫుల్ క్లారిటీ.. కూటమి సీఎం అభ్యర్థి పవన్..
Alliance: ఆ ఇద్దరిదీ ఒకటే మాట ఒకటే బాటగా ఉంది. పొత్తులపై చంద్రబాబు, పవన్ ఫుల్ క్లారిటీ ఇస్తోండటంతో ఒక అవగాహనకు వచ్చేశారా అన్న అభిప్రాయం పొలిటికల్ సర్కిల్‌లో బలంగా విన్పిస్తోంది.
Alliance: ఆ ఇద్దరిదీ ఒకటే మాట ఒకటే బాటగా ఉంది. పొత్తులపై చంద్రబాబు, పవన్ ఫుల్ క్లారిటీ ఇస్తోండటంతో ఒక అవగాహనకు వచ్చేశారా అన్న అభిప్రాయం పొలిటికల్ సర్కిల్‌లో బలంగా విన్పిస్తోంది. వైసీపీని ఓడించడమే లక్ష్యమంటూ ఇద్దరూ స్పష్టం చేస్తున్నారు. 2014లో టీడీపీ, బీజేపీ కోసం వర్క్ చేసిన పవన్ కల్యాణ్ 2019లో టీడీపీ, బీజేపీకి దూరంగా రాజకీయాలు చేశారు. ఐతే ఎన్నికల తర్వాత బీజేపీతో కలిసి రాజకీయం చేస్తూ వచ్చారు. కానీ అది అంతంత మాత్రంగానే సాగింది. కానీ ఏపీలో జగన్ సర్కారును సాగనంపకపోతే రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు తప్పవంటున్నారు పవన్ కల్యాణ్. అందుకు కలిసి పనిచేయాలన్న పల్లవి అందుకుంటున్నారు.
టీడీపీతో పొత్తుకు బీజేపీ పెద్దలను ఒప్పిస్తారన్న గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అందుకు భిన్నంగా బీజేపీ నేతల వ్యాఖ్యలు వస్తున్నాయ్. దీంతో బీజేపీ, జనసేన మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. మొత్తంగా టీడీపీ, జనసేన పొత్తు ఖాయమన్న ఫీలింగ్ వచ్చేసింది. మొత్తంగా టీడీపీకి ఫేవర్‌గా ఉండటంతో 2024 ఎన్నికల్లో పవనే సీఎం అభ్యర్థన్న భావనలో జనసైనికులు ఉన్నారు. జగన్‌ను ఓడించేందుకు టీడీపీ ఆ మాత్రం త్యాగం చేయలేదా అన్న అభిప్రాయాన్ని జనసేన కార్యక్తలు విన్పిస్తున్నారు. రాష్ట్రప్రజల కోసం పొత్తులు అవసరమంటున్న పవన్ రాజకీయాలు, వ్యూహాలు ఉంటాయంటూ క్లారిటీ ఇస్తున్నారు. ఇలాంటి తరుణంలో సీఎం అభ్యర్థిగా జనసేనానికి ఛాన్స్ ఉంటుందా? అందుకు టీడీపీ అంగీకరిస్తుందా? అన్న చర్చ ఇప్పుడు హైలెట్ అవుతోంది.