Pawan Kalyan: 2024లో ప్రజా ప్రభుత్వం స్థాపిస్తాం

Pawan Kalyan: ముమ్మాటికీ అమరావతే రాజధాని

Update: 2022-03-15 01:02 GMT

Pawan Kalyan: 2024లో ప్రజా ప్రభుత్వం స్థాపిస్తాం 

Pawan Kalyan: 2024న ఏపీలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా వైసీపీ వ్యతిరేక ఓటును చీలకుండా చూస్తామని ప్రకటించారు. ఎమర్జెన్సీ సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న శక్తులన్నీ కలిశాయన్న జనసేనాని ఇప్పుడు అలాగే వైసీపీ శక్తులు కలవాలని పిలుపునిచ్చారు. అంతేకాదు ఇకపై రాష్ట్ర బాధ్యతను జనసేన తీసుకుంటుందన్నారు పవన్ కల్యాణ్.

ఇక ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా రాజధానులు మారవన్న పవన్ సీఎంలు మారినప్పుడల్లా పాలసీలు మారవని స్పష్టం చేశారు. పాలసీల్లో తప్పులుంటే సరిచేయాలన్నారు. ప్రజలు ఒక్క ఛాన్స్ ఇస్తే పాతికేళ్లు వెనక్కి తీసుకెళ్లారని, మళ్లీ వస్తే పిల్లల చేతిలో చాక్లెట్లూ లాగేస్తారంటూ వైసీపీ సర్కార్ పై తీవ్రంగా మండిపడ్డారు. ఇక ఏపీ రాజధాని అమరావతి ఎక్కడకీ వెళ్లదని అన్నారు పవన్ కల్యాణ్.

మొత్తానికి వైసీపీ నేతలు అధికార మథంతో రెచ్చిపోతున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. వచ్చే ఎన్నికల్లో సరికొత్త ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తామని బళ్ల గుద్ది చెప్పారు. తాము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ని అప్పుల్లేని రాష్ట్రంగా చేస్తామని, ముమ్మాటికి అమరావతే రాజధాని ఉంటుందని, సీపీఎస్ రద్దుతోపాటు పాత పెన్షన్లనే అమలు చేస్తామన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.

Tags:    

Similar News