Anandayya Mandu: ఆన్‌లైన్‌లో ఆనందయ్య మందు
Anandayya Mandu: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందు తయారీకి ఆయన మామిడీతోటలో సర్వం సిద్ధం చేస్తున్నారు.
Anandayya Mandu: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందు తయారీకి ఆయన మామిడీతోటలో సర్వం సిద్ధం చేస్తున్నారు. ఆనందయ్య కరోనా మందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో పంపిణీ విధానంపై నెల్లూరు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ చక్రధర బాబు, ఎస్పీ భాస్కర్ భూషణ్, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్దన్‌రెడ్డిలతో పాటు ఆనందయ్య హాజరయ్యారు.
ఆనందయ్య మందులను వీలైనంత త్వరలో ఆన్ లైన్ ద్వారా పంపిణీ ప్రారంభిస్తామని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు వెల్లడించారు. ఆనందయ్య ఇచ్చే మందుల కోసం ఇరుగు పొరుగు రాష్ట్రాల నుండి జనం భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడం.. మరో వైపు కరోనా లాక్ డౌన్ పరిస్థితుల నేపధ్యంలో ఇబ్బందులు నివారించేందుకు ఆన్ లైన్ ద్వారా పంపిణీ చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ముడిసరకు సమీకరించి, నాలుగైదు రోజుల్లో మందు పంపిణీ ప్రారంభిస్తామని వెల్లడించారు. వికేంద్రీకరణ, ఆన్‌లైన్ విధానం ద్వారానే మందు పంపిణీ జరుగుతుందని, నేరుగా ఇతర ప్రాంతాల వారు ఎవ్వరూ మందు కోసం రావొద్దని అధికారులు సూచించారు. అవసరమైన ప్రాంతాలకు తామే మందు పంపిణీ చేస్తామని వెల్లడించారు.