Vijayawada: ముగియని వంగవీటి రాధా ఏపీసోడ్
Vijayawada: సెక్యూరిటీని వద్దన్న వంగవీటి రాధా.. ప్రభుత్వం వర్సెస్ ప్రతిపక్షం
Vijayawada: వంగవీటి రాధా పేరిట బెజవాడలో మరోసారి రాజకీయం వేడెక్కింది. తనను హత్య చేసేందుకు రెక్కీ జరిగిందని ఆరోపిస్తున్నారు రాధా. దీంతో ఆయనకు సెక్యూరిటీ ఇచ్చేందుకు సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం. కాగా గన్‌మెన్లను రాధా వద్దంటే, టీడీపీ పెద్దలు తీసుకోవడమే మంచిదంటున్నారు. మరోవైపు పోలీసులు రెక్కీనే జరగలేదంటున్నారు. సీసీ ఫుటేజ్‌ల ఆధారంగా అసలేం జరిగిందో తెలుసుకుంటున్నారు పోలీసులు.
రాధ విషయంలో చెడు జరిగితే తాను ముందుండి తన తమ్ముడిని కాపాడుకుంటానన్నారు రాధా పెద్ద తండ్రి కొడుకు నరేంద్ర. ఎప్పుడు రాధాకు గన్‌మేన్లను ప్రభుత్వం ఇస్తానందో అప్పుడు నరేంద్ర మాట్లాడటం మానేశారు. రాధా ఏపీసోడ్‌లో సీసీ ఫుటేజ్ దృశ్యాలు కూడా లేకపోవడంతో జీరో ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదంటున్నారు పోలీసులు. పూర్తి సమాచారం ఇస్తే రాధాకు భద్రత కల్పించడంలో ముందు ఉంటామన్నారు సీపీ.
మరోవైపు ప్రతిపక్ష టీడీపీ వైసీపీలో ఉన్న దేవినేని తనయుడే కారణం కావచ్చంటూ కామెంట్ చేస్తుంది. రెండ్రోజులుగా టీడీపీ నేతలు రాధాను కలుస్తూనే ఉన్నారు. ఇప్పటికే పోలీసులు చెడ్డీ గ్యాంగ్, చోరీలు, బ్లేడ్ బ్యాచ్‌లు అంటూ క్షణం ఖాళీ లేకుండా పనిచేస్తుంటే ఇప్పుడు వంగవీటి రాధా ఏపీసోడ్ మరో పెద్ద టాస్క్‌గా మారింది.