Raghu Rama Raju: ఎంపీ రఘురామ అరెస్ట్ తీరుపై ఎన్‌హెచ్ఆర్‌సీ సీరియస్
Raghu Rama Raju: ఏపీ డీజీపీ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలకు నోటీసులు * 4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశం
Raghu Rama Raju: ఎంపీ రఘురామ కృష్ణరాజు అరెస్టు జరిగిన తీరుపై ఎన్‌హెచ్ఆర్‌సీ సీరియస్ అయింది. రఘురామ కుమారుడు భరత్ ఫిర్యాదుతో ఏపీ డీజీపీ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలకు నోటీసులు ఇచ్చింది. దీనిపై 4 వారాల్లోగా సమాధానం ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. కస్టడీలో రఘురామపై పోలీసుల దాడికి సంబంధించి అంతర్గత విచారణకు ఆదేశించిన ఎన్‌హెచ్ఆర్‌సీ.. జూన్ 7లోగా నివేదిక ఇవ్వాలని డీజీపీకి స్పష్టం చేసింది.