Rain Alert: రైతులకు అలర్ట్..రానున్న 36గంటల్లో మరో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు

Update: 2024-11-10 01:46 GMT

Cyclone Dana: దానా సైక్లోన్ దారెటు?

Rain Alert: ఏపీ రైతులకు వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది. రానున్న 36గంటల్లో మరో అల్పపీడనం ఏర్పడుతున్నట్లు తెలిపింది. మూడు రోజులు పాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతుందని..ఈ అల్పపీడన ప్రభావంతో 36గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.

ఈ నేపథ్యంలో ఈనెల 12,13,14 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు, మిగతా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వెల్లడించారు. వర్షాల నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ సంస్థ హెచ్చరించింది.

మంగళ, బుధవారలో రాయలసీమ, కోస్తాంధ్ర, యానాంలోని కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేశారు.

అందువల్ల వరికోతలు చేపట్టే రైతులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇక శాటిలైట్ అంచనాలు చూస్తే ఆదివారం రాష్ట్రాల్లో ఎక్కడా వర్షాలు ఛాన్స్ లేదు. అయితే తెలికపాటి మేఘాలు వస్తుంటాయి. అందువల్ల ఆదివారం టూర్లకు వెళ్లేవారికి వాతావరణం పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.


Tags:    

Similar News