Konaseema: తల్లి రికార్డు బ్రేక్ చేసిన ముర్రా జాతి గేదె.. రోజుకు 26.59 లీటర్లు పాలు ఇస్తున్న..
Konaseema: పాలదిగుబడిలో ముర్రా జాతి గేదె రికార్డ్
Konaseema: అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో ముర్రా జాతి గేదె పాల దిగుబడిలో రికార్డు సృష్టించింది. ముత్యాల సత్యనారాయణకు చెందిన నాలుగేళ్ల గేదె రాష్ట్రంలోనే అత్యధికంగా రోజుకు 26.59 లీటర్లు పాలు ఇస్తోంది. అంతేగాక తన తల్లి పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసింది. ఎనిమిదేళ్ల కిందట. ఈ రైతు ముర్రా జాతి గేదెను నిజామాబాద్ జిల్లాలో కొనుగోలు చేశాడు. 2016 డిసెంబరులో మండపేటలో జరిగిన రాష్ట్రస్థాయి పాల పోటీల్లో 26.59 లీటర్ల (27.41కిలోలు) పాల దిగుబడితో అవార్డు సాధించింది. ఆ గేదెకు ఆరో ఈతలో జన్మించిన గేదె ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసింది. శని, ఆదివారాల్లో పాల దిగుబడిని లెక్కించగా రోజుకు 27.42 కిలోల మేర దిగుబడి వచ్చిందని కేంద్రీయ పశు నమోదు పథకం స్టాక్‌మెన్ డి.రాజేశ్వరరావు తెలిపారు. ఈ గేదె విలువ రూ.5 లక్షలు వరకు ఉంటుందని రైతు చెప్పారు.