Kesineni Chinni: జగన్ మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారు
Kesineni Chinni: పోలీసు అధికారులపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై కూటమి నేతలు మండిపడుతున్నారు.

Kesineni Chinni: జగన్ మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారు
Kesineni Chinni: పోలీసు అధికారులపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై కూటమి నేతలు మండిపడుతున్నారు. దీనిపై స్పందించిన ఎంపీ కేశినేని చిన్ని.. జగన్ మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. పోలీసుల్లో మహిళలు కూడా ఉంటారనే ఆలోచన కూడా లేకుండా గుడ్డలు ఊడదీస్తానని వ్యాఖ్యానించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాప్తాడు పర్యటనలో భద్రతపై డ్రామాలు చేస్తున్నారని.. జగన్ తన డ్రామాలు ఆపకపోతే వచ్చే ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో సర్పంచ్‌గా కూడా గెలవలేవని అన్నారు కేశినేని చిన్ని.
పోలీస్ వ్యవస్థపై జగన్ వ్యాఖ్యలకు ఎంపీ పురంధేశ్వరి కౌంటర్
పోలీసులను ఉద్దేశించి వైసీపీ అధినేత చేసిన జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. రాప్తాడులో పర్యటించిన జగన్ పోలీస్ అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు చంద్రబాబుకు వాచ్‌మెన్‌లుగా చేస్తున్నారని.. తమ ప్రభుత్వం వచ్చాక వారి గుడ్డలూడదీసి కొడతామని అన్నారు. జగన్ వ్యాఖ్యలను ఖండించిన పురంధేశ్వరి.. సత్యసాయి జిల్లా ఎస్పీ ఒక మహిళ అనే విచక్షణ లేకుండా జగన్ మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ వ్యవస్థను కించపరిచేలా మాట్లాడిన జగన్.. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.