Aghori, Srivarshini marriage: అఘోరీని పెళ్లి చేసుకున్న శ్రీవర్షిణి... నేనే మొదటి భార్యను అంటున్న మరో యువతి

Update: 2025-04-15 12:16 GMT
Lady aghori got married to Srivarshini, a B.tech student from Nandigama in AP, video goes viral

Aghori, Srivarshini marriage: అఘోరీని పెళ్లి చేసుకున్న శ్రీవర్షిణి... నేనే మొదటి భార్యను అంటున్న మరో యువతి

  • whatsapp icon

Aghori, Srivarshini tie the knot: అఘోరీ, శ్రీవర్శిణి పెళ్లి చేసుకున్నారు. వర్షిణిని పెళ్లి చేసుకుంటానని గతంలోనే ప్రకటించిన అఘోరి ఇప్పుడు అన్నంత పనిచేశాడు. మధ్యప్రదేశ్‌లోని ఒక ఆలయంలో ఆ ఇద్దరూ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆలయంలో అర్చకులు ఆ ఇద్దరికీ పెళ్లి జరిపించడం, వారిని చుట్టూ ఉన్న వారు ఆశీర్వదించడం ఆ వీడియోలో కనిపిస్తోంది.

ఏపీలోని నందిగామకు చెందిన వర్శిణి బీటెక్ చదువుతోంది. అఘోరి పట్ల ఆకర్షితురాలైన వర్షిణి ఇంట్లో చెప్పకుండా అఘోరితో వెళ్లిపోవడం తెలిసిందే. ఆ తరువాత ఆ ఇద్దరూ గుజరాత్ లో ఉన్నారని తెలుసుకున్న వర్షిణి కుటుంబం ఆమెను బలవంతంగా ఇంటికి తీసుకురావడం జరిగింది. కానీ వర్షిణి మాత్రం మరోసారి ఇంట్లోంచి వెళ్లిపోయి ఈసారి ఏకంగా అఘోరితో తాళి కట్టించుకుంది.

అఘోరి, శ్రీవర్షిణి పెళ్లి చేసుకున్నట్లు తెలియడంతో ఆయనకు మొదటి భార్యగా చెప్పుకుంటూ మరో యువతి కూడా మీడియా ముందుకు వచ్చారు. ఆయన నన్ను పెళ్లి చేసుకుని మోసం చేసి ఇప్పుడు వర్షిణి అనే మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని ఆ యువతి ఆరోపిస్తున్నారు. అఘోరిపై కేసు నమోదు చేసి ఆయన మరొకరి జీవితంతో ఆడుకోకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ యువతి కోరుతున్నారు.

అఘోరి గురించి బాధిత యువతి మాట్లాడుతూ, మొదటిసారి భక్తి భావంతో ఆయన్ను కలిశానని అన్నారు. చిన్నప్పటి నుండి ఒక ఆశ్రమం ఏర్పాటు చేసి గోమాతలను సంరక్షించాలని, ఏ అండదండలు లేని వృద్ధులను చూసుకోవాలనే ఆశయంతోనే తను అఘోరికి దగ్గరైనట్లుగా ఆ బాధితురాలు చెప్పారు. ఆశ్రమం నిర్మించేందుకు అవసరమైన స్థలం కోసం ఇద్దరం ఎన్నో చోట్లకు వెళ్లి చూడటం జరిగిందని, కానీ కొన్ని ఇతర కారణాలతో ఆశ్రమం నిర్మించలేకపోయామని అన్నారు.

వర్షిణి అనే అమ్మాయికి అఘోరి దగ్గరైనట్లుగా, వారు ఇద్దరూ కలిసి తిరుగుతున్నట్లుగా మీడియా కథనాల ద్వారానే తనకు తెలిసిందని బాధితురాలు తెలిపారు. ఇదే విషయమై అఘోరిని నిలదీసినందుకు తన మొబైల్ నెంబర్ బ్లాక్ చేశాడని అన్నారు. మార్చి 10న తన వద్దకు వచ్చి తన మెడలో కట్టిన వెండి తాళిని తీసుకెళ్లాడని, ఇప్పుడాయన మెడలో కనిపిస్తున్న తాళి తనదేనని బాధితురాలు మీడియాకు వెల్లడించారు.

ఇదిలావుంటే, బాధితురాలు చేస్తోన్న ఆరోపణలపై అఘోరి కూడా స్పందించారు. వర్షిణితో తను చనువుగా తిరుగుతుంటే ఇన్నాళ్లు ఎందుకు అభ్యంతరం చెప్పలేదని అన్నారు. అంతేకాదు... అఘోరీని పెళ్లి చేసుకున్నట్లుగా ఆమె కుటుంబంలో కానీ లేదా ఆమె పనిచేస్తోన్న కోర్టులో తోటి న్యాయవాదులతో ఎందుకు చెప్పుకోలేదని అఘోరి ప్రశ్నిస్తున్నారు. ఆమె న్యాయవాదిగా పనిచేస్తున్న కోర్టులోనే కేసు పెట్టి న్యాయ పోరాటం చేసుకొమ్మంటూ అఘోరి ఆ యువతిని ఉద్దేశించి మాట్లాడిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అఘోరీలకు అర్థం మార్చేసిన అఘోరి

అఘోరీలు అంటేనే సంసార బాధ్యతలకు దూరంగా కాశీ లాంటి పుణ్య క్షేత్రాల్లో ఆ శివుడిని పూజించుకుంటూ స్మశానాల్లో జీవిస్తారు అనే పేరుంది. కానీ ఈ అఘోరి మాత్రం అఘోరి అనే పేరుకు అర్ధాన్నే మార్చేశారు. అమ్మాయిలతో సావాసం, పెళ్లి, మీడియాకు ఇంటర్వ్యూలతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియా హల్‌చల్ చేస్తున్నారు. ఈ అఘోరి అసలు పేరు అల్లూరి శ్రీనివాస్ అని కూడా ప్రచారం జరుగుతోంది. మున్ముందు ఈ అఘోరి ఎపిసోడ్‌లో ఇంకెన్ని ట్విస్టులు చూడాల్సి వస్తుందోనని నెటిజెన్స్ జుట్టు పీక్కుంటున్నారు.

Tags:    

Similar News