Rain Alert: తెలుగు రాష్ట్రాలకు నేడు భారీ వర్ష సూచన ..ఉరుములు, మెరుపులతో భీకర వర్షం

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు నేడు భారీ వర్ష సూచన ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. మధ్యప్రదేశ్ దక్షిణం నుంచి బెంగాల్ వరకు ఒక ద్రోణి, మధ్యప్రదేశ్ దక్షిణం నుంచి కర్నాటక వరకు మరో ద్రోణి ఉన్నట్లు తెలిపింది. వీటి కారణంగానే వచ్చే ఐదు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఏపీ, తెలంగాణ, యానాం, కన్నాటక , తమిళనాడు, పుదుచ్చేరీలో కురుస్తాయని తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మిశ్రమంగా ఉంటుందని తెలిపింది. ఏపీలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణ, హైదరాబాద్ తోపాటు ఇతర ప్రాంతాల్లో ఏప్రిల్ 16న పాక్షికంగా మేఘావ్రుతమైన అకాశం, తేలికపాటి వర్షాలతో కూడిన వాతావరణం ఉండవచ్చు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని..దీని వల్ల రహదారులపై నీరు నిలిచే పరిస్థితి ఉండే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒకటి రెండు చోట్లు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఏపీలో గంటకు 11 కిలోమీటర్లు, తెలంగాణలో గంటకు 16 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.