AP SSC Results 2025: పదో తరగతి విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఏప్రిల్‌ 23న ఫలితాలు విడుదల.. ఎలా చేసుకోవాలంటే..

AP SSC Results 2025: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈనెల 23వ తేదీ విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పరీక్షలకు సంబంధించిన పేపర్ల వాల్యుయేషన్ కూడా పూర్తయింది. ఈనెలలోనే ఫలితాల విడుదలకు కూడా ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.

Update: 2025-04-19 07:39 GMT
TS 10th Result 2025: పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల..92.78శాతం ఉత్తీర్ణత

TS 10th Result 2025: పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల..92.78శాతం ఉత్తీర్ణత

  • whatsapp icon

AP SSC Results 2025: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈనెల 23వ తేదీ విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పరీక్షలకు సంబంధించిన పేపర్ల వాల్యుయేషన్ కూడా పూర్తయింది. ఈనెలలోనే ఫలితాల విడుదలకు కూడా ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.

ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాలు ఈనెల 23వ తేదీన విడుదల కానున్నాయి. ఇప్పటికే వాల్యుయేషన్ కూడా పూర్తయింది. ఆన్‌లైన్లో ఎంట్రీ చేస్తున్నారు. అయితే పదో తరగతి పరీక్షలకు 6 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 5 లక్షలకు పైగా ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు రాయగా.. 51 వేల మందికి పైగా తెలుగు మీడియం పరీక్షలు రాశారు.

ఇదిలా ఉండగా మార్చి 17 నుంచి మార్చి 31 వరకు ఆంధ్రప్రదేశ్‌లో 10వ తరగతి పరీక్షలు నిర్వహించారు.ఇక వ్యాల్యూయేషన్‌ కూడా పూర్తవడంతో ఆన్‌లైన్ ఎంట్రీ చేస్తున్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇక విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ అయిన bie.ap.gov.in అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

ఈసారి ప్రత్యేకంగా వాట్సాప్ వెసులుబాటు కూడా కల్పించింది. ఏపీ ప్రభుత్వం ఈ నేపథ్యంలో 955230090 నెంబర్‌కు 'Hi' అని పంపించి మీ పదో తరగతి పరీక్ష ఫలితాలు కూడా తెలుసుకోవచ్చు. మీసర్వీస్‌పై క్లిక్ చేసి పదో తరగతి ఫలితాలు పొందవచ్చు. మీ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ కూడా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇక అధికారిక వెబ్‌సైట్ ద్వారా పదో తరగతి పరీక్షలు చెక్ చేసుకునే విధానం..

Bse.ap. gov. In అధికారిక వెబ్‌సైట్లో'SSC పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చి 2025 ఫలితాలు' పై క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సబ్మిట్ చేస్తే మీ రిజల్ట్ మీ ముందు కనిపిస్తుంది. ఇంకా ఎస్ఎంఎస్ రూపంలో పదో తరగతి ఫలితాలు పొందాలంటే హాల్ టికెట్ నెంబర్‌ను 55352కి పంపించాలి.

Tags:    

Similar News