ఏవీ సుబ్బారెడ్డికి భూమా వార్నింగ్: ఆళ్లగడ్డలో టెన్షన్

Allagadda High-Tension: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ నాయకులు ఏవీ సుబ్బారెడ్డిని ఆళ్లగడ్డ వీడి వెళ్లాలని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ వార్నింగ్ ఇచ్చారు.

Update: 2024-10-18 07:05 GMT

ఏవీ సుబ్బారెడ్డికి భూమా వార్నింగ్: ఆళ్లగడ్డలో టెన్షన్

Allagadda High-Tension: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ నాయకులు ఏవీ సుబ్బారెడ్డిని ఆళ్లగడ్డ వీడి వెళ్లాలని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే టెన్షన్ నెలకొంది. ఆళ్ళగడ్డకు రావొద్దని తనను ఆపడానికి భూమా అఖిలప్రియకు ఏం హక్కుందని ఏవీ సుబ్బారెడ్డి ప్రశ్నిస్తున్నారు. తాను ఆళ్ళగడ్డను వీడేదిలేదని ఆయన చెబుతున్నారు. దీంతో ఆళ్లగడ్డలో భారీగా పోలీసులు మోహరించారు. భూమా నాగిరెడ్డి బతికున్నసమయంలో ఏవీ సుబ్బారెడ్డి ఆయనకు కుడిభుజంగా ఉన్నారు. భూమా నాగిరెడ్డి మరణించిన తర్వాత కొంతకాలం ఏవీ సుబ్బారెడ్డికి , భూమా అఖిలప్రియ కుటుంబానికి మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి.

ఆ తర్వాత రెండు కుటుంబాల మధ్య అంతరం పెరిగింది. ఈ అంతరం ఎంతగా పెరిగిందంటే 2014-19 మధ్యకాలంలో ఏవీ సుబ్బారెడ్డి టీడీపీ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన సైకిల్ యాత్రలో ఆయనపై దాడియత్నం జరిగింది.ఈ దాడి నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఈ అంశం అప్పట్లో కలకలం రేపింది. దీనిపై టీడీపీ నాయకత్వం జోక్యం చేసుకోంది. ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ మరోసారి టీడీపీ అభ్యర్ధిగా గెలిచారు. అయితే కొంతకాలం నియోజకవర్గానికి ఏవీ సుబ్బారెడ్డి దూరంగా ఉన్నారు. అయితే ఆళ్ళగడ్డకు ఏవీ సుబ్బారెడ్డి అక్టోబర్ 17న వచ్చారు. దీంతో ఆళ్ళగడ్డను వీడి వెళ్లాలని ఆమె ఆయనను హెచ్చరించారు.

టీడీపీ అధిష్టానం నుంచి ఏవీ సుబ్బారెడ్డికి ఫోన్

ఏవీ సుబ్బారెడ్డిని ఆళ్లగడ్డ వీడి వెళ్లాలని అఖిలప్రియ వార్నింగ్ పై టీడీపీ నాయకత్వం ఫోకస్ పెట్టింది.టీడీపీ నాయకత్వం శుక్రవారం ఏవీ సుబ్బారెడ్డికి ఫోన్ చేసింది. ఈ విషయమై ఆరా తీసింది. మరో వైపు ఇవాళ టీడీపీ ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఏవీ సుబ్బారెడ్డి ఉదంతంపై చంద్రబాబు అఖిలప్రియతో మాట్లాడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అఖిలప్రియ మంత్రిగా ఉన్న సమయంలో కూడా ఏవీ సుబ్బారెడ్డితో గ్యాప్ ఉంది. ఈ విషయమై అప్పట్లో చంద్రబాబు వీరిద్దరిని పిలిపించి మాట్లాడారు. అయితే కొంతకాలం ఇద్దరు నేతలు స్ధబ్దుగానే ఉన్నారు. ఈ ఇద్దరు నేతల మధ్య గ్యాప్ తగ్గలేదని తాజాగా జరిగిన ఘటన మరోసారి రుజువు చేసింది.

ఏవీ సుబ్బారెడ్డిని నంద్యాలకు వెళ్లాలని పోలీసుల సూచన

ఏవీ సుబ్బారెడ్డి ఆళ్ళగడ్డకు రావడంతో టెన్షన్ వాతావరణం నెలకొనడంతో ఆయనను నంద్యాలకు వెళ్లిపోవాలని పోలీసులు సూచించారు. అయితే తన కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని ఏవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. దీంతో ఆయనను నంద్యాలకు వెళ్లిపోవాలని ఏవీ సుబ్బారెడ్డి పోలీసులు కోరారు.ఆళ్లగడ్డలోని పరిస్థితులను స్థానిక పోలీసులు ఉన్నతాధికారులకు చేరవేశారు.ఎలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

యువగళం పాదయాత్రలోనే గొడవ

యువగళం పాదయాత్ర నంద్యాల జిల్లాలో జరిగే సమయంలో ఏవీ సుబ్బారెడ్డి, భూమా అఖిలప్రియ వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఆ సమయంలో పార్టీ నాయకత్వం ఇరు వర్గాలకు నచ్చజెప్పింది. పార్టీ కోసం ఇద్దరు నాయకులు సమన్వయంతో పనిచేసుకోవాలని సూచించింది. ఈ ఏడాది మేలో పోలింగ్ జరిగిన మరుసటి రోజే భూమా అఖిలప్రియ అనుచరులు నిఖిల్ పై హత్యాయత్నం జరిగింది. కారుతో ఢీకొట్టి ఆయనను చంపాలని కొందరు ప్రయత్నించారు. ఇది ఏవీ సుబ్బారెడ్డి వర్గీయుల పనేనని భూమా అఖిలప్రియ ఆరోపించారు.ఈ ఘటనపై ఏవీ సుబ్బారెడ్డి అనుచరులపై భూమా వర్గం ఫిర్యాదు చేసింది. పోలింగ్ కు ముందు జరిగిన శంఖారావం సభకు ఏవీ సుబ్బారెడ్డిని రాకుండా అడ్డుకోవడంలో భూమా వర్గం పై చేయి సాధించింది.

Tags:    

Similar News