Vijayawada: విజయవాడలో బాలుడి గల్లంతు కథ విషాదాంతం..

Vijayawada: విజయవాడ గురునానక్ కాలనీలోని నాలాలో పడిన బాలుడు అభిరామ్ కోసం పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

Update: 2023-05-05 12:00 GMT

Vijayawada: విజయవాడలో బాలుడి గల్లంతు కథ విషాదాంతం..

Vijayawada: విజయవాడ గురునానక్ కాలనీలోని నాలాలో పడిన బాలుడు అభిరామ్ కోసం పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అభిరామ్ మృతదేహన్ని ఆయూష్ ఆస్పత్రి సమీపంలో గుర్తించారు. నాలాలో పడిపోయిన బాలుడి కోసం సుమారు రెండు గంటలకు పైగా గాలింపు చర్యలు చేపట్టారు. ఏలూరు రోడ్డు గురునానక్ కాలనీలోని ఓపెన్ నాలాలో బాలుడు పడిపోగా.. డ్రైన్ లో సుమారు కిలోమీటరున్నర దూరంలో మృతదేహం లభించింది. అభిరామ్ మృతదేహన్ని విజయవాడ ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించారు.

మధ్యాహ్నం సుమారు ఒంటి గంట ప్రాంతంలో అభిరామ్ నాలాలో పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘన స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. నాలాలో పడిన బాలుడిని కాపాడేందుకు పోలీసులు, ఫైర్ సిబ్బంది, స్థానికుల సహకారంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గురునానక్ కాలనీ బాలుడు నాలాలో పడిపోయిన ప్రాంతం నుంచి డ్రైన్ లో గాలింపు కొనసాగించారు. సుమారు రెండు గంటలకుపైగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. చివరికి ఆయూష్ ఆస్పత్రి సమీపంలోని డ్రైన్ లో బాలుడి మృతదేహన్ని పోలీసులు గుర్తించి.. మర్చూరీకి తరలించారు.

అభిరామ్ మృతి విషయం తెలియడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ బిడ్డ ఇక తిరిగిరాడనే విషయాన్ని తట్టుకోలేకపోతున్నారు. అభిరామ్ నాలాలో పడిపోయాడని తెలిసిన వెంటనే తండ్రి సృహకోల్పోయాడు. ఇక, అభిరామ్ చనిపోయాడనే విషయం తెలిసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తు్న్నారు.

Tags:    

Similar News