రింగువలల మత్స్యకారులతో మంత్రి సీదిరి అప్పలరాజు చర్చలు

Sidiri Appalaraju: మంత్రి అప్పలరాజు సమక్షంలో మత్సకార గ్రామాల పెద్దల ఒప్పందం

Update: 2022-07-30 02:17 GMT

రింగువలల మత్స్యకారులతో మంత్రి సీదిరి అప్పలరాజు చర్చలు

Sidiri Appalaraju: ప్రభుత్వ పెద్దల జోక్యంతో విశాఖలో రింగ్ వలల వివాదం సద్దుమనిగింది. కొంత కాలంగా సాంప్రదాయ వర్సెస్ రింగు వల మత్స్యకారుల మధ్య వివాదం చల్లారిందని భావిస్తున్న తరుణంలో రింగ్ వలల వివాదం మత్స్యకార గ్రామాల్లో ఉద్రిక్తతలకు దారి తిసింది. వివాదం అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. తాత్కాలింగా చేపల వేట నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చేందుకు మత్స్యకార గ్రామాల్లో 144వ సెక్షన్ విధించారు. బీచ్ సమీపంలో అదనపు పోలీసు బలగాలు మొహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు.

మరో వైపు రింగు వలల మత్స్యకారులతో మంత్రి సీదిరిఅప్పలరాజు చర్చలు జరిపారు. రింగ్ వలల వివాదంపై జెంటిల్ మెన్ ఒప్పందం పాటించాలని మంత్రి సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన రింగు వలల వినియోగదారులపై చర్యలు తప్పవన్నారు. ఇకపై ఎలాంటి వివాదాలకు వెళ్లకుండా జాగ్రత్త పడుతామని మత్స్యకారులు చెప్పారు. బోట్లు దగ్ధం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మత్స్యకార పెద్దలు నిర్ణయం తీసుకున్నారు.

Tags:    

Similar News