AP News: ఏపీ మహిళలకు అదిరిపోయే వార్త..ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటినుంచి అంటే?

AP News: ఆంధ్రప్రదేశ్ లోని మహిళలకు ప్రభుత్వం అదిరిపోయే వార్తను చెప్పింది. ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటినుంచో చెప్పేసింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Update: 2024-06-21 00:18 GMT

AP News: ఏపీ మహిళలకు అదిరిపోయే వార్త..ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటినుంచి అంటే?

AP News: ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడింది. అయితే ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి ఇచ్చిన హామీలన్నీంటిని నేరవేర్చేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఈమధ్యే సీఎం చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న సమయంలోనే డీఎస్సీ నోటిఫికేషన్ పై సంతకం చేశారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్, పలు ప్రధాన అంశాలపై సీఎం సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే ప్రకటిస్తారనుకున్న మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ ప్రకటన చేయలేదు. ఏపీలో మహిళలకు తాజాగా సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో మహిళలకు ఫ్రీ బస్సు స్కీంను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. అయితే ఈ స్కీంను ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకువస్తారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శలకు చేయడం ప్రారంభించింది.

ఈ విధంగా ఈ స్కీం గురించి సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. తమ కూటమి సర్కార్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని చెప్పుకొచ్చారు. మరో నెల రోజుల్లో మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో కసరత్తు ప్రారంభించినట్లు చెప్పారు. అన్ని మార్గదర్శకాలు త్వరలోనే రిలీజ్ అవుతాయన్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఒక కొత్త బస్సు కూడా కొనుగోలు చేయలేని పరిస్ధితి ఉందన్నారు. ఆర్టీసీ మనుగడ కాపాడేందుకు తన వంతు కృషి చేస్తానని మంత్రి తెలిపారు. అయితే ఇప్పటి వరకు మహిళలకు ఫ్రీ ప్రయాణ సౌకర్యం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదని ఎదురుచూపులు చేస్తున్న మహిళలకు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ప్రకటన వరంగా మారిందని చెప్పవచ్చు. తెలంగాణలో అమలు అవుతున్న ఆధార్ నియమావళిని, జీరో టికెట్ పద్దతిని అక్కడ కూడా పాటిస్తారా లేదా ఇతర విధివిధానాలు ఉన్నాయా అనేది పూర్తి మార్గదర్శకాల విడుదల తర్వాతే తెలుస్తుంది. 

Tags:    

Similar News