Cyclone Dana: దూసుకొస్తున్న దానా..ఏపీలో 4 రోజులు అత్యంత భారీ వర్షాలు..ఐఎండీ అలర్ట్
Cyclone Dana: బంగాళాఖాతంలో తీవ్ర తుపాన్ దానా ముప్పు పొంచి ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో ఏపీ, ఒడిశా, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. దీంతో భారత వాతావరణశాఖ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది.
Cyclone Dana: బంగాళాఖాతంలో తీవ్ర తుపాన్ దానా ముప్పు పొంచి ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో ఏపీ, ఒడిశా, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. దీంతో భారత వాతావరణశాఖ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం ఉదయానికి వాయుగుండంగా మారి సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా బలపడింది. బుధవారం ఉదయం వరకు తుపానుగా, గురువారం తెల్లవారు జామున తీవ్ర తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. దీని ప్రభావంతో గురువారం అర్థరాత్రి నుంచి శుక్రవారం ఉదయంలోపు పూరీ, సాగర్ ద్వీపం మధ్యలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు ఐఎండీ భావిస్తోంది.
ఈ తుపాన్ ప్రభావంతో అక్టోబర్ 25వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని ఐఎండీ వారికి సూచనలు జారీ చేసింది. తీర ప్రాంత పర్జలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. సముద్రంలో ఉప్పెనలు రావడం, గాలుల వేగం పెరగడం వంటి ప్రమాదాలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ సూచించింది.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తదితర జిల్లాల్లో 24,25 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయి. కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మెలిగిన చోట్ల తేలికపాటి వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.
అయితే ఈ తుపాన్ ప్రభావం తెలంగాణపై ఉండదని అధికారులు తెలిపారు. తెలంగాణలో సాధారణ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రజలు వాతావరణశాఖ సూచనలను గమనించి అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వర్షాల ప్రభావం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని తెలిపారు. ఇక తెలంగాణలో 23,24,25 తేదీల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్, వరంగల్ వంటి జిల్లాలకు వర్షసూచన ఉంది. ఈ ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.