ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు...
IPS Officers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
IPS Officers Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్, జూనియర్ స్థాయిలో అధికారులను బదిలీ చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. మంగళవారం ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ పేరు మీదుగా ప్రభుత్వ జీవో విడుదల అయ్యింది.
బదిలీ అయిన ఐపీఎస్ అధికారులు..
ఏసీబీ డీఐజీగా పీహెచ్ డీ రామకృష్ణ... టెక్నికల్ సర్వీసెస్ డీఐజీగా అదనపు బాధ్యతలు.
క్రీడలు, సంక్షేమం ఐజీగా ఎల్ కేవీ రంగారావు... రైల్వే ఏడీజీగా అదనపు బాధ్యతలు.
ఆక్టోపస్ డీఐజీగా ఎస్వీ రాజశేఖర్... లా అండ్ ఆర్డర్ డీఐజీగా అదనపు బాధ్యతలు.
పోలీసు ట్రైనింగ్ వ్యవహారాల డీఐజీగా కేవీ మోహన్ రావు.
తీర ప్రాంత సెక్యూరిటీ డీఐజీగా ఎస్.హరికృష్ణకు అదనపు బాధ్యతలు.
గ్రేహౌండ్స్ డీఐజీగా గోపీనాథ్ జెట్టి... జ్యుడిషియల్ వ్యవహారాల ఐజీగా అదనపు బాధ్యతలు.
16వ బెటాలియన్ కమాండెంట్ గా కోయ ప్రవీణ్ బదిలీ.
విజయవాడ రైల్వే ఎస్పీగా విశాల్ గున్నీకి అదనపు బాధ్యతలు
కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ కమాండెంట్ గా రవీంద్రనాథ్ బాబుకు అదనపు బాధ్యతలు.
గుంతకల్ రైల్వే ఎస్పీగా అజిత వేజెండ్లకు అదనపు బాధ్యతలు.
రంపచోడవరం అదనపు ఎస్పీ (ఆపరేషన్స్)గా జి.కృష్ణకాంత్.
చిత్తూరు అదనపు ఎస్పీ (అడ్మినిస్ట్రేషన్)గా పి.జగదీశ్.
పాడేరు అదనపు ఎస్పీ (అడ్మినిస్ట్రేషన్)గా తుహిన్ సిన్హా.
పల్నాడు అదనపు ఎస్పీ (అడ్మినిస్ట్రేషన్)గా బిందుమాధవ్ గరికపాటి.
విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ ఎస్పీగా పి.రవికుమార్.
పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్టు చేయాలని డి.ఉదయభాస్కర్ కు ఆదేశాలు.
పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు పి.అనిల్ బాబు బదిలీ.
పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు డీఎన్ మహేశ్ బదిలీ.