Rains Alert: బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం..రెండు ఆవర్తనాలు..తెలుగు రాష్ట్రాలకు వానలే వానలు
Rains Alert: ఉత్తర భారతం నుంచి ఈశాన్య రుతుపవనాలు మధ్య భారత్ కు తాకాయి. అవి సౌత్ కు వస్తే వర్షాలు పడే అవకాశం ఉంటుంది. అయితే అవి రాకుండా తెలుగురాష్ట్రాల్లో వానలు పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉంటుందో చూద్దాం.
Rains Alert: ఉత్తర భారతం నుంచి ఈశాన్య రుతుపవనాలు మధ్య భారత్ కు తాకాయి. అవి సౌత్ కు వస్తే వర్షాలు పడే అవకాశం ఉంటుంది. అయితే అవి రాకుండా తెలుగురాష్ట్రాల్లో వానలు పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉంటుందో చూద్దాం.
వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం అరేబియా సముద్రంలో ఒక అల్పపీడనం పడుతుండటంతో ఇది కర్నాటక, గోవాకు దగ్గరలో ఉంది. రెండు రోజుల్లోనే వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అలాగే నైరుతీ బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం ఏర్పడగా..అది తమిళనాడు తీరానికి దగ్గర్లో ఉంది. అలాగే మరో ఆవర్తనం అక్టోబర్ 12న దక్షిణ బంగాళాఖాతానికి పశ్చిమం వైపున ఏర్పడే ఛాన్స్ ఉంది.
ఈపరిస్థితుల నేపథ్యంలో ఈ వారమంతా తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. అక్టోబర్ 14,15,16 తేదీల్లో కోస్తాంధ్ర, యానాం,రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెబుతోంది. ఇక శుక్రవారం నుంచి మధ్యాహ్నం వరకు తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు వస్తూ పోతుంటాయి. మధ్యాహ్నం 2 తర్వాత కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తుంటాయి.
అవి క్రమంగాపెరగడంతో సాయంత్రానికి రాయలసీమ, కోస్తాంధ్ర, మధ్య తెలంగాణ, హైదరాబాద్ లోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి 7 తర్వాత మిగతా ప్రాంతాల్లో వర్షాలు తగ్గిపోతాయని..దక్షిణ రాయలసీమలో మాత్రం మోస్తరుగా కురస్తాయని వెల్లడించింది. అర్థరాత్రి వరకు వర్షాలు కురుస్తూనే ఉంటాయని చెప్పింది. అర్ధరాత్రి తర్వాత మళ్లీ కోస్తాలో వర్షాలు కురుస్తాయి.