Gajuwaka: లవర్స్ బరితెగింపు.. బండిపైనే పబ్లిక్‌గా పాడు పనులు..!
Lovers: గాజువాకలో ఓ ప్రేమ జంట రెచ్చిపోయింది.
Lovers: గాజువాకలో ఓ ప్రేమ జంట రెచ్చిపోయింది. పట్టపగలు పబ్లిక్‌లో తమ వికృత చేష్టలతో రెచ్చిపోయారు. గాజువాక స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ రోడ్‌లో ఓ ప్రేమ జంట నడిరోడ్డుపైనే బరితెగించారు. పబ్లిక్‌గా వీరు చేస్తోన్న ఈ పాడుపని అటుగా ఓ కారులో వెళ్తున్న వ్యక్తులు చిత్రీకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్టీల్‌ప్లాంట్ పోలీసులు స్పందించి.. గాలింపు చేపట్టారు.
గాజువాక సమీప వెంపలినగర్, సమతానగర్‌కు చెందిన యువతీ, యువకుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్టు స్టీల్‌ప్లాంట్ సీఐ వి.శ్రీనివాసరావు, ఎస్‌ఐ సీహెచ్.స్వామినాయుడు తెలిపారు. కాగా, ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా వారి వాహనాలను సీజ్ చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ సి.హెచ్ శ్రీకాంత్ హెచ్చరించారు.