పవన్ కళ్యాణ్ ది గేమ్ ఛేంజర్.. కొండంత అండగా కొండగట్టు అంజన్న.. కలిసొచ్చిన సెంటిమెంట్..

పవన్ కళ్యాణ్ విజయానికి పవనసుతుడి ఆశీస్సులు

Update: 2024-06-06 02:30 GMT

పవన్ కళ్యాణ్ ది గేమ్ ఛేంజర్.. కొండంత అండగా కొండగట్టు అంజన్న.. కలిసొచ్చిన సెంటిమెంట్..

మిత్రపక్షాలను ఏకం చేసి ఏపీ ఎన్నికల్లో గేమ్‌ ఛేంజర్‌గా మారిపోయారు పవన్ కళ్యాణ్. కనీవినీ ఎరుగని కూటమి ఫలితాలతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పవర్ స్టార్ పేరు చర్చనీయాంశగా మారింది. ఐతే పవన్ వ్యూహం, విజయంలో కొండంత అండంగా నిలిచింది ఎవరు..? పవర్ స్టార్‌కు ఆ పవన కుమారుడి సెంటిమెంట్ వర్కౌట్ అయ్యిందా..? వారాహి విజయదుందుభీకి ఆయన అనుగ్రహం తోడైందా..?

ఎన్నికల్లో వైసీపీని అథఃపాతాళానికి తొక్కుతా అంటూ బహిరంగ శపథం చేసిన పవన్.. మాట నిలబెట్టుకున్నారు. ఫ్యాన్ పార్టీని 151 సీట్ల నుంచి 11 స్థానాలకే పరిమితం అయ్యేలా చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఇటు బీజేపీని, అటు టీడీపీ ఒప్పించి..కూటమి ఏర్పాటులో కీలకంగా మారారు. పొత్తులో భాగంగా సీట్ల త్యాగానికీ రెడీ అయ్యారు. మొత్తానికి అనుకున్నది సాధించారు పవన్. వైసీపీని గద్దెదించి.. ఏపీలో నవ శకానికి నాంది పలికారు. 100శాతం సక్సెస్ రేటులో.. సగర్వంగా విజయ పతాకాన్ని ఎగురవేశారు. కూటమి ప్రభంజనంతో.. ఏపీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరిచాయి. పవన్ వ్యూహాలు, త్యాగాల గురించి.. జాతీయ మీడియా కూడా ఎలివేట్ చేస్తూ వచ్చింది. మొత్తానికి ఏపీ ఫలితాల్లో..పవన్ కళ్యాణ్ గేమ్ ఛేంజర్ గా మారిపోయారు.

వారాహి వాహనంలో పవన్ చేసిన ఎన్నికల ప్రచారం పని చేసిందంటూ జన సైనికులు ఆనందంతో ఉర్రూతలూగుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ విజయానికి పవనసుతుడు హనుమంతుడి ఆశీస్సులు ఉన్నాయంటూ తెలంగాణలోని పవన్ కళ్యాణ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారట. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో వారాహికి పూజలు చేసి అంజన్నకు కట్టిన ముడుపులు పని చేశాయంటూ ఆనందపడుతున్నారు. పవన్‌కు కొండంత అండగా నిలిచి.. గెలుపు తీరాలకు చేర్చారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజారాజ్యం ప్రచార సమయంలో జరిగిన ఓ ప్రమాదం నుండి కొండగట్టు ఆంజనేయుడే తనని కాపాడాడని నమ్మే పవన్ కళ్యాణ్.. నాటి నుండి కొండగట్టు ఆంజనేయ స్వామికి వీరభక్తుడిగా మారిపోయారు. జనసేన పార్టీ స్థాపించాక కూడా పవన్ కళ్యాణ్ కొండగట్టుకి వచ్చి ఆంజనేయ స్వామికి పూజలు చేశారు. ఇక 2023 జనవరిలో వారాహి వాహనాన్ని ప్రత్యేకంగా చేయించి కొండగట్టుకి తీసుకువచ్చారు. కొండగట్టులో వాహన పూజలు చేసి ఆంజనేయ స్వామికి ముడుపు కూడా కట్టారు పవన్ కళ్యాణ్. కొండగట్టులోనే వారాహి వాహన యాత్రని ఆయన సెంటిమెంట్ గా ప్రారంభించారు…ఆ తరువాత నేరుగా విజయవాడ వెళ్లి దుర్గమ్మకు పూజలు చేశారు. అనంతరం ఏపీలో తన వారాహి యాత్రని ప్రారంభించారు…అక్కడి నుండి పవన్ కళ్యాణ్ విజయ యాత్ర నేటి గెలుపు వరకు కొనసాగింది. ఎన్నికల ప్రచారం లో వారాహి వాహనం ప్రతి చోటా ఆకర్షణీయంగా మారింది…ఇలా కొండగట్టు అంజన్న ఆశీస్సులు పవన్ కళ్యాణ్ కి అద్భుతంగా ఉన్నాయంటూ తెలంగాణలోని అభిమానులు పవన్ గెలుపుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు…

నిజానికి కొండగట్టు సెంటిమెంట్ ఒక్క పవన్ కళ్యాణ్ కే కాదు తెలంగాణలోని చాలా మంది రాజకీయ నాయకులకి వర్కౌట్ అయింది. అవుతూనే ఉంది…మాజీ మంత్రి హరీష్ రావు , కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ..,ఎంపీ అరవింద్ ..,బండి సంజయ్ …ఇలా చాలా మంది కొండగట్టు అంజన్న చెంత ముడుపులు కట్టి వియజయాన్ని అందుకున్నవారే…ఇప్పుడు కింగ్ మేకర్ గా మారిన పవన్ కళ్యాణ్ కి కూడా ఆ కొండగట్టు అంజన్న సెంటిమెంట్ వర్కౌట్ అయిందన్న వాదన నినపడుతోంది…పవన్ కళ్యాణ్ కూడా త్వరలోనే మళ్లీ కొండగట్టు వచ్చి తన మొక్కు తీర్చుకుంటారాని ఆయన అభిమానులు చెబుతున్నారు..

Tags:    

Similar News