Karthika Masam: కార్తికమాస చివరి సోమవారం.. శైవక్షేత్రాల్లో రద్దీ

Karthika Masam: కార్తీక చివరి సోమవారం సందర్భంగా తరలివచ్చిన భక్తులు

Update: 2023-12-11 05:40 GMT

Karthika Masam: కార్తికమాస చివరి సోమవారం.. శైవక్షేత్రాల్లో రద్దీ

Karthika Masam: కార్తీక చివరి సోమవారాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలలో ఉన్న శైవక్షేత్రాలతోపాటు అన్ని ఆలయాలు భక్తులతో క్రిక్కిరిసాయి. ఆయా ప్రాంతాలలో ఉన్న ఆలయాల్లో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి, ప్రత్యేక పూజలు చేశారు. కర్నూలు జిల్లా శ్రీశైలం క్షేత్రంలో భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. కార్తీక మాస శోభను సంతరించుకున్న శ్రీశైల మహాక్షేత్రం శివ నామస్మరణతో మార్మోగుతుంది. సిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి గా పాటుగా వివిధ ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం నుండి భక్తులు ధర్మ గుండంలో పుణ్యస్థానాలు ఆచరించి,స్వామి వారికి ప్రీతి పాత్రమైన కోడె మొక్కు చెల్లిస్తున్నారు. భక్తుల రద్దీతో క్యూ లైన్లు నిండిపోయాయి. దీంతో స్వామి వారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది.

Tags:    

Similar News