KA Paul: దీక్ష భగ్నం చేసిన పోలీసులు.. సీఐ కాలర్ పట్టుకున్న కేఏ పాల్
KA Paul: వైద్యం అవసరం లేదంటూ పరుగులు పెట్టిన కేఏ పాల్
KA Paul: విశాఖపట్నంలో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీక్షా శిబిరం నుంచి ఆయనను తరలించి.. కేజీహెచ్‌కు తలరించారు. ప్రైవేటీకరణ నిలిపేయాలంటూ కేంద్రానికి 48 గంటల గడువిచ్చిన పాల్.. ఎలాంటి స్పందన రాకపోవడంతో దీక్ష చేపట్టారు. రెండు రోజులుగా దీక్ష చేస్తున్న పాల్‌ను ఇవాళ బలవంతంగా దీక్షా శిబిరం నుంచి తరలించారు పోలీసులు.
అయితే కేజీహెచ్‌కు తరలించిన సమయంలో కేఏ పాల్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. వైద్యం అవసరం లేదంటూ గలాటా చేశారు. తనను వదిలిపెట్టాలని అరుపులు కేకలు వేసిన పాల్.. ఈ క్రమంలో పోలీస్ కాలర్ పట్టుకున్నారు.