Nagababu Fire On Voters : మీకు ప్రశ్నించే హక్కు లేదు: నాగబాబు

Nagababu On Voters : సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తాజా రాజకీయ పరిస్థితుల పైన స్పందిస్తూ ఉంటారు సినీ నటుడు, జనసేన

Update: 2020-08-10 12:06 GMT
Nagababu(File photo)

Nagababu On Voters : సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తాజా రాజకీయ పరిస్థితుల పైన స్పందిస్తూ ఉంటారు సినీ నటుడు, జనసేన లీడర్ నాగబాబు.. ఇప్పటివరకు ప్రభుత్వం పైన రాజకీయ నాయకుల పైన విమర్శలు చేసిన నాగబాబు ఇప్పుడు ఏకంగా ప్రజలనే టార్గెట్ చేశారు. తాజాగా అయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఎన్నికల్లో ఓటు వేయకుండా ఇంట్లోనే ఉండిపోయిన వారిని, డబ్బు తీసుకుని ఓటు వేసిన వారిని నాగబాబు విమర్శించారు. కష్ట సమయం లో నాయకులు దాక్కున్నారు అంటున్నావ్, ఓటు వేసేటప్పుడు వెయ్యకుండా నువ్వెక్కడ దాక్కున్నావు? 40% ఓటు వేయని జనానికి ప్రశ్నించే హక్కు లేదు అని అయన ట్వీట్ చేశారు.

అంతేకాకుండా రాష్ట్రంలో అభివృద్ది లేదు, కష్టం వస్తే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం, అని నిందించే హక్కు రెండు వేలు తీసుకుని ఓటు వేసిన నీకు లేదు అంటూ ఆయన మరో ట్వీట్ చేశారు. అయన చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారాయి.. ఎన్నికల సమయంలో బాధ్యత లేకుండా ప్రవర్తించిన వారు ఇప్పుడు ఎలా ప్రశ్నిస్తున్నారు అంటూ నాగబాబు చేసిన ట్వీట్స్‌ను పలువురు సమర్ధిస్తున్నారు. ఎన్నికల్లో ఓటు వేసి అప్పుడు మాట్లాడాలంటూ పలువురు కూడా అభిప్రాయ పడుతున్నారు.

 

Tags:    

Similar News