Janasena: ముద్రగడకు జనసైనికుల మనియార్డర్లు.. పోస్ట్ ఆఫీస్ల ముందు భారీ క్యూ
Janasena: రూ.1000 మనియార్డర్ చేసిన నానాజీ
Janasena: కాపు ఉద్యమనేత ముద్రగడకు జనసైనికులు ఝలక్ ఇచ్చారు. కాపు ఉద్యమం సమయంలో పెట్టిన ఉప్మా, భోజనం డబ్బులను మనియార్డర్ ద్వారా వాపస్ పంపుతున్నారు. కాపు ఉద్యమానికి ద్వారంపూడి సహకరించారని ముద్రగడ తన లేఖలో పేర్కొనడంతో.. ద్వారంపూడికి డబ్బులు తిరిగి ఇవ్వాలని జనసేన నేత పంతం నానాజీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తాను ముద్రగడకు వెయ్యి రూపాయలు మనియార్డర్ చేశారు. దాంతో జనసేన కార్యకర్తలు కూడా పోస్టాఫీసులకు క్యూ కట్టారు. దీంతో కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని పోస్టాఫీసులన్నీ నిండిపోయాయి.