ఇవాళ జనసేన, టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం

Andhra News: మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రిలో సమావేశం

Update: 2023-10-23 02:12 GMT

ఇవాళ జనసేన, టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం

Andhra News: ఏపీలో అధికార వైసీపీపై ఉమ్మడి పోరుకు సిద్ధమయ్యాయి టీడీపీ, జనసేన పార్టీలు. ఇందులో భాగంగానే ఏర్పడిన జనసేన, టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం ఇవాళ రాజమండ్రిలో జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అధ్యక్షతన భేటీ జరగనుంది. ఇప్పటికే రెండు పార్టీల నుంచి ఐదుగురు చొప్పున 10 మంది సమన్వయ కమిటీ సభ్యులను ఇరు పార్టీలు నియమించాయి. తొలి సారి రెండు పార్టీల మధ్య జరగనున్న ఈ సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇక ఈ సమావేశంలో టీడీపీ, జనసేనల ఉమ్మడి పోరాటంతో పాటు సమన్వయంపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. రెండు పార్టీలూ ఇప్పటికే సమన్వయ కమిటీలు నియమించాయి. ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటానికి రెండు పార్టీలు కలిసి కార్యాచరణను రూపొందించనున్నాయి. అలాగే ఉమ్మడి సమావేశాల ఏర్పాటుపై కూడా చర్చ జరగనుంది. ఈ మేరకు ప్రణాళికను సిద్ధం చేయనున్నారు. ప్రజల్లోకి ఏ విధంగా వెళ్లాలన్న దానిపై ఇరు పార్టీల నేతలు చర్చించనున్నారు.

మరో వైపు ఏపీ వ్యాప్తంగా రాజకీయ కార్యకలాపాలను వ్యూహరచన చేయడం, వేగవంతం చేయడంపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది. 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో.. అధికార వైసీపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు తమ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబును ములాఖత్‌లో కలిసిన అనంతరం ఈ విషయాన్ని ఆయన ప్రకటించారు. త్వరలో వారాహి ఐదో విడత యాత్రకు పవన్‌కల్యాణ్ సన్నాహాలు చేస్తున్నారు. వైసీపీ సర్కార్ టార్గెట్‌గా టీడీపీ, జనసేన జాయింట్ ఆపరేషన్ చేపట్టబోతున్నాయి. మరి సమన్వయ కమిటీ సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చకు రానున్నాయనేది ఏపీలో చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News