శ్రీకాకుళం జిల్లాలో కోడెబళ్ల పందేరం క్రీడ గురించి తెలుసా?

*శ్రీకాకుళం జిల్లాలో వందల ఏళ్ల నుంచి జల్లికట్టు తరహ క్రీడా *పొందూరు పరిసర గ్రామాల్లో నిర్వహిస్తున్న కోడెబళ్ల పందేరం

Update: 2021-01-17 09:30 GMT

జల్లికట్టు ఫైల్ ఫోటో 

జల్లికట్టు ... ఈ పేరు వింటే తమిళనాడు గుర్తుకు వస్తుంది... దానికి ధీటుగా సిక్కోలు జిల్లాలో కూడా వందల ఏళ్లుగా జల్లికట్టు నిర్వహించడం విశేషం. ఇంతవరకూ ఈ విషయం బయటకు పొక్కకుండా నిర్వహించడం మరో విశేషం. ఐతే, ఇక్కడ జల్లికట్టు పేరు మారింది. ఆ విన్యాసాలేంటో మరి ఒకసారి చూసేద్దామా..?

శ్రీకాకుళం జిల్లా... పొందూరు పంచాయితీకి చెందిన లోలుగు. పొందూరు, వాండ్రంగి గ్రామాల్లో జల్లికట్టు పందేరం నిర్వహిస్తారు. ఐతే, ఇక్కడ మాత్రం ఎటువంటి రక్తపాతం లేకుండా నిర్వహిస్తారు. దీనికి స్ఠానినికులు మరోపేరు 'కోడేబళ్ల పందేరం" అని పెట్టారు. దీన్ని కనుమ రోజున రైతులందరూ కలిసి తప్పనిసరిగా నిర్వహిస్తారు.

పందేరం చూడడానికి ఉత్తరాంద్రా జిల్లాల నుండి వందలాది మంది పాల్గొనడంతో ఈ సంబరాలు అంబరాన్నంటే స్థాయిలో జరిగాయి. ముందుగా ఈ పందెం కోసం రైతులు ఇంట్లో ఆడవాళ్లతో కలిసి నాగలిని ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. అనంతరం యువకులు ఇరుకు వీధుల్లో ముందు పరుగెడుతుంటే వారిని తొక్కడానికి వెనుక ఎద్దురు పరుగులు తీస్తాయి. ఈ క్రమంలో ఎద్దులకు గాని, చూసే వారికి గాని ఎటువంటి హాని జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొనే ఇక్కడ 'కోడేబళ్ల పందేరం" నిర్వహిస్

తమిళనాడులో జరిగే జల్లికట్టులానే ఈ పందేరం ఉన్నప్పటికీ దానితో దీన్ని పోల్చలేము. ఈ క్రీడను చూసేందుకు పోలీసులు సైతం వస్తుంటారు. ఈ పోటీల్లో నెగ్గిన వారి పంటలు విస్తారంగా పండుతాయని ఇక్కడ రైతన్నల నమ్మకం.

Tags:    

Similar News