Lady Aghori: శ్రీకాళహస్తి ఆలయంలో మహిళా అఘోరి ఆత్మార్పణ యత్నం
Lady Aghori: శ్రీకాళహస్తి ఆలయంలో మహిళా అఘోరి ఆత్మార్పణకు యత్నించింది. ఆలయానికి వెళ్లిన అఘోరిని సెక్యూరిటీ సిబ్బంది లోనికి అనుమతించలేదు.
Lady Aghori: శ్రీకాళహస్తి ఆలయంలో మహిళా అఘోరి ఆత్మార్పణకు యత్నించింది. ఆలయానికి వెళ్లిన అఘోరిని సెక్యూరిటీ సిబ్బంది లోనికి అనుమతించలేదు. దీంతో వారితో వాగ్వాదానికి మహిళా అఘోరి దిగింది. ఆలయంలోకి అనుమతించకపోవడంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మార్పణకు సిద్ధమైంది. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది మహిళా అఘోరిపై నీళ్లు పోసి అడ్డుకున్నారు.
ఈ ఘటనపై ఆలయ సెక్యూరిటీ సిబ్బంది మాట్లాడుతూ.. అఘోరి మాత సాధారణంగా భక్తుల వలె స్వామి వారిని దర్శనం చేసుకుంటే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, కానీ అఘోరీ మాత వస్త్రధారణ పాటించకపోవడంతోనే తాము అడ్డు తగిలినట్లు వారి వాదన వినిపించారు.
స్థానిక పోలీసులు సైతం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. ఈ వివాదం పై అఘోరిమాత కూడా స్పందిస్తూ.. తాను వైజాగ్ పర్యటనలో వస్త్రధారణ పాటించానని, అసలు విషయాన్నీ తెలపకుండా, తనను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నట్లు ఆరోపించారు. మొత్తం మీద ఆత్మార్పణయత్నానికి పాల్పడ్డ అఘోరిమాతను, స్థానిక పోలీసులు నివారించడంతో పెను ప్రమాదం తప్పింది.