YSR Asara Scheme: రేపు ఒంగోలు వెళ్లనున్న సీఎం జగన్
YSR Asara Scheme: వైఎస్సార్ ఆసరా రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సీఎం జగన్ రేపు ఒంగోలుకు వెళ్లనున్నారు.
YSR Asara Scheme: వైఎస్సార్ ఆసరా రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సీఎం జగన్ రేపు ఒంగోలుకు వెళ్లనున్నారు. ఉదయం 9 గంటల 55 నిమిషాలకు తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 10.35కు ఒంగోలు పోలీసు ట్రైనింగ్ కాలేజీకి చేరుకోనున్నారు. ఇక 11 గంటలకు సభాస్థలి అయిన ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకుంటారు. పది నిమిషాల పాటు స్టాల్స్‌ను పరిశీలిస్తారు. 11 గంటల 15 నిమిషాలకు జ్యోతి ప్రజ్వలన, తరువాత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అనంతరం 11.40 నుంచి 12 గంటల వరకు లబ్ధిదారులతో సీఎం ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం 12.30కి వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రారంభిస్తారు. ఇక 12.40కి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్‌తో కార్యక్రమం ముగుస్తుంది.
అయితే సీఎం మార్గానికి ప్రజలు అడ్డు రాకుండా ఉండేందుకు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో హెలిపాడ్ ఏర్పాట్లు, వేదిక వద్దకు సీఎం వచ్చే రూటును ఆర్‌అండ్‌బీ అధికారులు పర్యవేక్షించాల్సిందిగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. కాగా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. కోవిడ్ రెండు టీకాలు వేయించుకున్న వారిని మాత్రమే కార్యక్రమానికి అనుమతించనున్నారు.