Game Changer movie: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు భేటీ అందుకేనా?
Dil Raju and Pawan Kalyan meeting aimed at Game Changer promotions: పవన్ కళ్యాణ్, దిల్ రాజు మీటింగ్‌లో గేమ్ చేంజర్ మూవీ టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోస్‌కు అనుమతి ఇప్పించడం లాంటి అంశాలు కూడా ప్రధానంగా చర్చకు రానున్నాయనే టాక్ బలంగా వినిపిస్తోంది.
Dil Raju and Pawan Kalyan meeting aimed at Game Changer promotions: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను సోమవారం దిల్ రాజు కలవనున్నారు. సంక్రాంతి రేసులో ఉన్న గేమ్ చేంజర్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్‌ని కలిసి ఆయన వీలు ప్రకారమే డేట్ సెట్ చేసి ఆయన్ను ఆహ్వానించనున్నారు. అయితే, ఇదే భేటీలో గేమ్ చేంజర్ మూవీ టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోస్‌కు అనుమతి ఇప్పించడం లాంటి అంశాలు కూడా ప్రధానంగా చర్చకు రానున్నాయనే టాక్ బలంగా వినిపిస్తోంది.
గేమ్ చేంజర్ మూవీ కూడా బిగ్ బడ్జెట్ చిత్రాల్లో ఒకటి. ఈ సినిమాకు టికెట్ రేట్ల పెంపు, బినిఫిట్ షోలకు అనుమతి లేకపోతే మూవీ యూనిట్ వర్గాలు అనుకున్నట్లుగా బిజినెస్ చేసుకోవడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా ఏ సినిమాకైనా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ చాలా ముఖ్యం. అంతేకాకుండా అది సంక్రాంతి సెలవుల సమయం కూడా. అందుకే ఫస్ట్ వీకెండ్ వీలైనంత ఎక్కువ కలెక్షన్స్ రాబట్టుకుంటేనే... ఫస్ట్ వీక్ రిజల్ట్‌ను బట్టి ఆ తరువాతి బాక్సాఫీస్ రిజల్ట్ ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఏపీ సర్కారు ఏ నిర్ణయం తీసుకుంటుంది?
అయితే, ఇటీవలే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళా అభిమాని చనిపోవడం, ఆమె కుమారుడు గాయాలతో ఆస్పత్రిపాలవడం వంటి పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఏపీ సర్కారు ఏం నిర్ణయం తీసుకోనుందా అనేదే ప్రస్తుతానికి సర్వత్రా ఉత్కంఠగా మారింది.
దేశంలోనే భారీ కటౌట్.. ఎంత ఎత్తంటే..
రామ్ చరణ్ అప్ కమింగ్ మూవీ గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ దగ్గరపడింది. దీంతో విజయవాడలో గేమ్ చేంజర్ మూవీ ప్రమోషన్స్ కూడా షురూ అయ్యాయి. 2025 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అవుతుండటంతో రామ్ చరణ్ అభిమానులు గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన స్టిల్ తో భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. వజ్ర గ్రౌండ్ లో 256 అడుగుల కటౌట్ ఏర్పాటు చేసి రామ్ చరణ్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు.
దేశంలో ఇంత భారీ కటౌట్ ఇప్పటివరకు ఎప్పుడూ ఏర్పాటు చేయలేదు. దీంతో ఆ రికార్డ్ కూడా గేమ్ చేంజర్ మూవీ స్టార్ రామ్ చరణ్‌కే దక్కిందని అభిమానులు చెప్పుకుంటున్నారు. రామ్ చరణ్ కటౌట్ ఆవిష్కరణకు భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. దీంతో ఆదివారం వజ్ర గ్రౌండ్‌లో రామ్ చరణ్ అభిమానులకు పండగ వాతావరణం నెలకొంది.