Vamsadhara River: వంశధార నదిలోకి క్రమేపీ పెరుగుతున్న నీటి మట్టం
Vamsadhara River: గొట్టా బ్యారేజీ గేట్లు ఎత్తి దిగువవకు నీటి విడుదల
Vamsadhara River: శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నదిలో క్రమేపీ నీటి మట్టం పెరుగుతోంది. ఒడిశాలో విస్తారంగా వర్షావు కురుస్తుండటంతో వంశధార ఇంజినీర్లు అప్రమత్తమయ్యారు. గొట్టా బ్యారేజీ గేట్లు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ ప్రధాన కాలువలకు నీటిని నిలిపివేశారు. ఇన్‌ఫ్లో 21 వేల 755, అవుట్ ఫ్లో 20వేల755 క్యూసెక్కులు నమోదైనట్లు నీటిపారుదల శాఖఘ అదికారులు తెలిపారు. క్యాచ్‌మెంట్ ఏరియాలో 13.46 మి.మీల వర్షపాతం నమోదైందని, క్రమేపీ వంశధారలో నీటి ప్రవాహం పెరుగుతుందన్నారు. జు ఎగువ ప్రాంతాల్లోను కురుస్తున్న వర్షాలకు నాగావళి నదిలో వరదనీటి ప్రవాహం పెరుగుతోంది. మడ్డువలస, తోటపల్లి ప్రాజెక్టుల నుంచి నీటిని నదిలో విడుదల చేయడంతో నదిలో 35 వేల క్యూసెక్కులకు పైగా వరదనీరు వస్తున్నట్లు అధికారులు తెలిపారు.