Rain Alert: ఇవేం వానలు...ఏపీపై మళ్లీ ఆవర్తనం..తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
Rain Alert: భారత వాతావరణ కేంద్రం తాజా రిపోర్ట్ ప్రకారం..నైరుతీ బంగాళాఖాతంపై ఒక ఆవర్తనం ఉంది. ఇది ఏపీకి దక్షిణంగా ఉందని..ఈ ఆవర్తనం వల్ల రాయలసీమలో గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. దీపావళిపండగ రోజు తెలుగు రాష్ట్రాలపై రోజంతా మేఘాలు, వస్తూ పోతుంటాయి. ఉదయం 7 గంటల నుంచి ఉత్తర తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మొదలై సాయంత్రం వరకు కురుస్తాయి.
సాయంత్రం 5 తర్వాత దక్షిణ రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అర్థరాత్రి వరకు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. గురువారం వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ..భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుందని...ఎక్కు ప్రాంతాల్లో ప్రభావం తక్కువగా ఉంటుందని పేర్కొంది.
గత కొన్నిరోజులుగా తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్ధితులు నెలకొన్నాయి. వాతావరణంల ఉన్నట్లుండి అనూహ్య మార్పులు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో విపరీతమైన ఎండగాలులు, కొన్ని చోట్ల చలి ఉంటుంది.
అయితే నేడు తెలంగాణలో వాతావరణం ఎలా ఉంటుందంటే..గత వారం క్రితం బంగాళాఖాతలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఆవర్తనంగా మార్పు చెంది బలహీనపడినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ ఆవర్తనం కూడా పూర్తిగా బలహీనపడుతున్నట్లు చెప్పారు.