Urmila Gajapathiraju on politics: అవకాశం వస్తే రాజకీయాల్లోకి వస్తా.. ఊర్మిళ గజపతిరాజు!

Urmila Gajapathiraju on politics: రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి ఉన్నట్టు ఊర్మిళ గజపతిరాజు వెల్లడించారు.

Update: 2020-07-17 15:17 GMT

Urmila Gajapathiraju on politics: అవకాశం వస్తే రాజకీయాల్లోకి వస్తానని మాజీ ఎంపీ, పూసపాటి ఆనంద గజపతిరాజు, సుధా కూతురు ఊర్మిళ గజపతిరాజు అన్నారు. శుక్రవారం అనంద గజపతిరాజు 70వ జన్మదినం సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి మరణానంతరం అశోక గజపతిరాజు అనేక రాజకీయ కుట్రలకు ప్రయత్నించారని ఊర్మిళ విమర్శించారు. సింహాచలం దేవస్థానం, మాన్సాస్ ట్రస్ట్ విషయంలో కొందరు రాజకీయం చేయడం చూసి చాలా బాధ కలిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మాన్సాస్ ట్రస్ట్ నుంచి తమను ఉద్దేశపూర్వకంగా దూరం చేయాలనే కుట్ర చేస్తున్నారని.. ఇప్పటికే ఆ విధమైన ప్రయత్నాలు చేశారని ఆమె అన్నారు. తన తండ్రి మరణం అనంతరం ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తున్నట్టు వెల్లడించారు.

భవిష్యత్‌లో అవకాశం వస్తే తప్పకుండా రాజకీయాల్లో వచ్చి తన తండ్రి ఆశయాలను నెరవేరుస్తానని ఊర్మిళ తెలిపారు. మెడికల్ కాలేజీ స్థాపించాలన్నది ఆనంద గజపతిరాజు కల. ఆయన బ్రతికి ఉండి ఉంటే ఇప్పటికే మెడికల్ కాలేజీ పూర్తయ్యేదని అన్నారు. ఆనంద గజపతిరాజు ఎప్పుడూ తాత పీవీజీ రాజు ఆశయాలను కొనసాగించడం కోసమే కృషిచేశారని. అందులో భాగంగానే ఇంజినీరింగ్ కాలేజీలు స్ధాపించడం, మాన్సాస్ ట్రస్ట్ ను నడిపించడం చేశారని అన్నారు. తన తండ్రి ఆనంద గజపతిరాజు మరణించే సమయానికి తన వయసు 16 సంవత్సరాలు అని అన్నారు. 

Tags:    

Similar News